.webp)
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే చర్చ నడుస్తోంది అదే పూణే హత్య కేసు. ఒక నెటిజన్ ఈ విషయం మీద డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ని అడిగిన ప్రశ్నకు ఆయన ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక చిన్మయి శ్రీపాద ఐతే "రాహుల్ లాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోండి లేదంటే పెళ్లి చేసుకుని బాధలు పడకండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఆ తర్వాత మీ ఇష్టం మీ జీవితం " అని చెప్పారు. అలాగే స్టేటస్ లో కూడా ఇప్పుడు ఉన్న ఈ సొసైటీలో పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఇప్పుడున్న పరిస్థితిని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే "నాకు అన్నీ తెలుసని నేను అనుకోవడం లేదు. తప్పైతే చెప్పండి, నేర్చుకుంటాను. కానీ స్త్రీలు పురుషులపై దౌర్జన్యాలు చేస్తున్నారనే కోణంలో నేను చూడడం లేదు.

చెడు మనస్తత్వం ఉన్న కొంతమంది మహిళలు నేరాలు చేస్తున్నారు అంతే.కానీ మరోవైపు, చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సమాజ వ్యవస్థ మహిళలను అణిచివేయడం కూడా నేను చూస్తున్నాను. మహిళలు రోజూ ఎదో సందర్భంలో వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు వారికి సమాన అవకాశాలు లభించడం లేదు. నా చుట్టూ చాలా మంది మహిళలు ఇలా మౌనంగా బాధపడటం నేను చూశాను. అందుకే ఒక పురుషుడిగా, ఆ అసమానత వల్ల బాధ్యతతో ఈ కథ చెప్పాలనుకున్నాను.ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ జరుగుతున్నా ఈ కేసు గురించి పూర్తిగా తెలుసుకోలేదు.
తెలుసుకున్నక చెప్పదగ్గ కథ అనిపిస్తే దానిపైనా సినిమా తీస్తాను. కానీ అది ఒక మహిళ చేసిన నేరం గురించి మాత్రమే ఉంటుంది. దాన్ని మొత్తం మహిళలపై ముద్ర వేసే కథగా చూపించను. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.అలాంటి నేరాలు చాలా దారుణమైనవే. కానీ నేను చెప్పాలనుకున్న కథకు వాటికి సంబంధం లేదు.'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీలో విక్రమ్ హంతకుడు కాదు శారీరక హింస కూడా చేయడు. తన ప్రేమకు నమ్మకంగా ఉండే వ్యక్తే. అయినా ఈ సినిమాపై కొందరు ఎందుకు అంతగా స్పందిస్తున్నారో ఒకసారి ఆలోచించండి.అయితే ఎవరికైనా నా సినిమా లేదా నా అభిప్రాయంపై అభ్యంతరాలు ఉంటే చెప్పండి. నేను ఆ విమర్శలను స్వీకరిస్తాను. వాటిపై ఆలోచిస్తాను. మనం ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు మాట్లాడుకోవడం చాలా అవసరం." అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు.






