
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని( Akhil Akkineni) నుంచి రాబోతున్న సరికొత్త చిత్రం 'లెనిన్'(Lenin). 'ఏజెంట్' వంటి భారీ యాక్షన్ చిత్రం తర్వాత అఖిల్ నుంచి వస్తున్న మూవీ కావడంతో, లెనిన్ పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మురళి కిషోర్ అబ్బురి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా పూర్తి వైల్డ్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ అండ్ ఫ్యామిలీ వార్ కాన్సెప్ట్‌తో కథను డిజైన్ చేశారు.
సరికొత్త లుక్, మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ బాడీ లాంగ్వేజ్‌తో అఖిల్ ఈ చిత్రంలో ఊరమాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.ఈ చిత్రంలో అఖిల్ సరసన టాలీవుడ్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. "ప్రేమని మించిన యుద్ధం లేదు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రీసెంట్‌గా విడుదలైన 'సోల్ ఆఫ్ లెనిన్' వీడియో సాంగ్ థియేటర్లలో పెద్ద సంచలనమే సృష్టించింది. 'పెద్ది' మూవీ ప్రదర్శించబడుతున్న థియేటర్లలో ఈ సాంగ్‌ని అటాచ్ చేయగా, ప్రేక్షకుల నుంచి 100 శాతం బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లవ్ అండ్ యాక్షన్ సాంగ్‌లో అఖిల్ చూపించిన రౌద్ర రసం, భాగ్యశ్రీ గ్లామర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేశాయని చెప్పాలి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గాయని వాగ్దేవి ఆలపించిన పవర్‌ఫుల్ వోకల్స్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.
also read: RajaShivaji: రాజా శివాజీ ఓటిటి డేట్ వచ్చేసింది.. స్పెషల్ ఇదే
ఈ భారీ ప్రాజెక్టును మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా ఫస్ట్ కట్ చూసిన కింగ్ నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "లెనిన్ ఫస్ట్ కట్ చూశాను, జూన్ 26న మీరు ఒక సరికొత్త అఖిల్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. నేను చాలా గర్వంగా, నమ్మకంగా చెబుతున్నాను" అంటూ ట్వీట్ చేయడం సినిమాపై హైప్‌ను ఆకాశానికి తీసుకెళ్లింది. థియేట్రికల్ రిలీజ్ డేట్ జూలై 10 కి ఫిక్స్ అవ్వడంతో, బాక్సాఫీస్ వద్ద అఖిల్ సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. అక్కినేని అభిమానులు ఈ వైల్డ్ మాస్ యాక్షన్ పండగ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.




.webp)

