Home

»

Latest News

Priyanka Chopra: అందం ఉంటే సరిపోదని ప్రియాంక చోప్రాపై మైక్ విసిరిన మన గురువు గారు

Apr 30, 2026 5:03PM

 


  
పాన్ వరల్డ్ నటిగా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ప్రస్తుతం మహేష్(Mahesh),రాజమౌళి(Ss Rajamouli)ల వారణాసి(Varanasi)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మందాకినీ గా తన విశ్వరూపాన్ని ప్రదర్శించనుందనే టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఆ కెపాసిటీ కూడా సదరు కట్ అవుట్ కి ఉందనే నిజం తెలిసిందే. రీసెంట్ గా ప్రియాంక ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె ప్రముఖ డాన్స్ మాస్టర్ వలన తనకి జరిగిన అవమానం గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. మరి ఆ మాటలేంటో చూద్దాం.

ప్రియాంక మాట్లాడుతు నా తొలి హిందీ చిత్రం 'అందాజ్' కి సంబంధించి సాంగ్ షూటింగ్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. నేను సరిగా  స్టెప్పులు వేయలేకపోతున్నాను. డాన్స్ చేస్తూనే కళ్ళతో హావభావాలు పలికించడం కష్టంగా మారింది. దీంతో  కొరియోగ్రాఫర్ రాజు ఖాన్(Raju Khan)నాపై అసహనానికి గురయ్యారు. నువ్వు ఎంత అందగత్తేవి అయినా, మిస్ వరల్డ్ అయినా అవ్వచ్చు. కానీ నటి కావాలంటే ముందు డాన్స్ నేర్చుకో అని అందరి ముందు అరుస్తూ మైక్‌ను కింద విసిరికొట్టారు. 

Also read: Kalki 2: కల్కి 2 , ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన జెడి

ఆ సంఘటనని సవాలుగా తీసుకుని  కత్రినా కైఫ్‌తో కలిసి రోజుకి ఆరుగంటలు డాన్స్  ప్రాక్టీస్ చేసానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. మరి ఇప్పుడు మెరుపు తీగలాగా డాన్స్ చెయ్యగల సమర్థురాలు.   

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com