Home

»

Latest News

Kalki 2: కల్కి 2 , ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన జెడి

Apr 30, 2026

 

 

ప్రభాస్(Prabhas),నాగ్ అశ్విన్(Nag Ashwin)ల కల్కి 2 పార్ట్ 1 ని మించి తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.  బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట షురూ అనే నమ్మకం కూడా అందరిలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా గత కొన్ని రోజులుగా ఈ సీక్వెల్‌లో  జేడీ చక్రవర్తి(Jd Chakravarthy)ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపించబోతున్నాడనే న్యూస్ ని తనకి ఎదురే లేదు నేను చెప్పేది నిజమంటూ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటా ఉంది. ఇప్పుడు ఆ ప్రచారానికి జెడి నే ముక్కుతాడు వేయడం కొసమెరుపు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం.   


 రీసెంట్ గా  ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జేడీకి 'కల్కి 2'లో మీరు చేస్తున్నారా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఆయన చాలా స్పష్టంగా, తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో ఏదైనా వార్త ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందో  కల్కి 2 విషయంలో నా పేరు వినిపించడం చూస్తే అర్థమవుతోంది. సీక్వెల్‌లో నేను చేస్తునట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇప్పటి వరకు చిత్ర యూనిట్ నుంచి  నాకు ఎలాంటి పిలుపు కూడా రాలేదు. నేను ఉన్నాననే  ప్రచారం కేవలం పుకారు మాత్రమే.. కానీ ప్రస్తుతానికి నేను ఆ ప్రాజెక్టులో భాగం కాదు. 'కల్కి' మొదటి భాగం చూసి ఎంతో ఎంజాయ్ చేశాను.

 నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు. ఆయన మేకింగ్ స్టైల్ సూపర్. ప్రభాస్  భైరవ క్యారక్టర్ ని అద్భుతంగా పోషించాడు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణం. నాకు  ఇలాంటి భారీ ప్రాజెక్టులలో చేయాలనీ  ఉన్నప్పటికీ, పిలవనిదే వెళ్లలేము కదా అని వ్యాఖ్యానించారు.

Also read: Peddi: పెద్ది నుంచి మరో లుక్ రీలీజ్..చరణ్ గెటప్ ఇదేనా! 


జేడీ చక్రవర్తి వంటి విలక్షణ నటుడు 'కల్కి' ప్రపంచంలో ఉంటే బాగుంటుందని ఆశించిన అభిమానులకు ఆయన మాటలు కొంత నిరాశ కలిగించవచ్చు. అయితే సినిమాల్లో ఏదైనా జరగచ్చు కాబట్టి భవిష్యత్తులో జేడీ కోసం నాగ్  అశ్విన్  ఏదైనా పవర్‌ఫుల్ క్యారక్టర్ ని డిజైన్ చేస్తాడేమో చూడాలి. జెడి  రేపు గాయపడ్డ సింహం తో అభిమానులని, ప్రేక్షకులని కలవనున్నాడు.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com