Home

»

Latest News

ఫౌజీ రీషూట్: అవుట్‌పుట్ నచ్చలేదా?.. తెరవెనుక ఏం జరుగుతోంది.?

Oct 9, 2026 4:56PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్‌ను సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘ఫౌజీ’ కోసం రామ్‌-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారట. అయితే ఆ సీక్వెన్స్ అవుట్‌పుట్ టీమ్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో, ఇప్పుడు ప్రముఖ ఫైట్ మాస్టర్ సాల్మన్ నేతృత్వంలో మళ్లీ చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ రీషూట్‌కు సంబంధించిన వార్తల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఫైట్ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అయ్యే అవకాశం ఉందట. ప్రభాస్ ఒకవైపు, రజాకార్లు మరోవైపు ఉండే భారీ యాక్షన్ ఎపిసోడ్‌గా దీన్ని రూపొందిస్తున్నట్లు టాక్. 

ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో ప్రభాస్ వార్ మెషీన్ వాహనంపై సిగార్‌తో కనిపిస్తారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. వన్ ఆర్మీగా ప్రభాస్ ప్రత్యర్థులను ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలవవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

‘ఫౌజీ’ కథ స్వాతంత్ర్యానికి ముందు కాలం నేపథ్యంలో సాగనుండటంతో.. ఆ కాలానికి తగ్గట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. హను రాఘవపూడి తనదైన భావోద్వేగభరితమైన కథనానికి యాక్షన్‌ను జోడిస్తే, ప్రభాస్ అభిమానులకు మరో కొత్త అనుభూతి దక్కే అవకాశం ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌ను వచ్చే వారంలో పూర్తి చేయాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

మొత్తానికి ‘ఫౌజీ’లో ప్రభాస్‌ను యుద్ధవీరుడిగా చూపించే యాక్షన్ ఎపిసోడ్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా వన్ ఆర్మీ వర్సెస్ రజాకార్ల పోరాటమే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే.. థియేటర్లలో అభిమానులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: మళ్ళీ ఫ్యామిలీ బాటలో నాని.. ప్యారడైజ్ దెబ్బకు రక్తపాతానికి గుడ్‌బై.!

 

 

 

[Prabhas Fauzi ReShoot, Fauzi Movie Update, Prabhas Action Sequence, Fauzi Interval Bang, Fauzi Razakars Fight, Prabhas Fauzi Movie, Rebl Star Prabhas, Hanu Raghavapudi, Telugu Film News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com