Home

»

Latest News

‘ఫౌజీ’లో ప్రభాస్ విధ్వంసం: ఆ 15 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్‌కి థియేటర్లు షేక్ అవుతాయి.!

Oct 25, 2026 5:29PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఇప్పుడు ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా ప్రభాస్ చేతిలో భారీ రైఫిల్‌తో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక ఈ గ్లింప్స్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గ్లింప్స్‌లో చూపించిన ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ సినిమాలో సుమారు 15 నిమిషాల పాటు సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేసేలా ఈ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో రూపొందించారని, దాని అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వచ్చిందని టాక్‌.

రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ‘ఫౌజీ’ కథ సాగనుంది. గ్లింప్స్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో పాటు, బ్రిటిష్ పాలకులకు సవాల్ విసిరే రహస్య సైనికుడిగా ప్రభాస్ పాత్రను పరిచయం చేశారు. దేశం కోసం పోరాడే తిరుగుబాటు సైనికుడిగా ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ప్రభాస్ లుక్‌, యాక్షన్ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో స్పై థ్రిల్లర్ అంశాలను జోడించడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘సీతారామం’తో గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్‌, మిథున్ చక్రవర్తి, సుబోధ్ భావే, జయప్రద తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ-సిరీస్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ముందుగా 2026 డిసెంబర్‌లో విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేసి, 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇది కూడా చదవండి: మెగా అప్డేట్.. చిరంజీవి ‘కాకా’లో మరో బాలీవుడ్ స్టార్.!

 

 

 

[Prabhas Fauzi 15 Minute Action Sequence, Prabhas Fauzi Movie, Fauzi Action Sequence, Fauzi Glimpse, Rebel Star Prabhas, Fauzi Release Date, Hanu Raghavapudi, Imanvi, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com