Home

»

Gossips

మెగా అప్డేట్: చిరంజీవి ‘కాకా’లో మరో బాలీవుడ్ స్టార్.!

Oct 25, 2026 4:59PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగం కానున్నారనే ప్రచారం జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. అనిల్ కపూర్ ‘కాకా’లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్‌. ఆయన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో, ఇప్పుడు అనిల్ కపూర్ పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.

కేవీఎన్ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు 85 శాతం పూర్తయిందని, డిసెంబర్ మొదటి వారంలోగా షూటింగ్ ను  ముగించాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ‘కాకా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, బాబీ కలయికలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: బిగ్గెస్ట్ డీల్‌.. ‘జనవరి 12 విడుదల’ బిజినెస్‌ క్రేజ్ మామూలుగా లేదుగా.!

 

 

 

[Anil Kapoor In Kaaka Movie, Chiranjeevi Kaaka, Megastar Chiranjeevi, Kaaka Movie Update, Anil Kapoor, Anurag Kashyap, Bobby Kolli, Anaswara Rajan, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com