
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి గ్యాంగ్స్టర్లు, ఎన్కౌంటర్ల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సత్య, కంపెనీ వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు నిజ జీవిత ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ కథతో ‘పోలీస్ కంపెనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2027 జూన్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.
ముంబై పోలీస్ శాఖలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన దయా నాయక్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1997 నుంచి 2004 మధ్య కాలంలో దయా నాయక్ నేతృత్వంలోని బృందం 319 మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్లలో హతమార్చినట్లు ఈ సినిమా ప్రచారంలో పేర్కొంటున్నారు. ఆ కాలంలో ముంబై అండర్‌వరల్డ్, గ్యాంగ్‌వార్స్, పోలీసుల ఆపరేషన్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అలాంటి నేపథ్యాన్ని ఆర్జీవీ తనదైన శైలిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.
ఈ సినిమా పోస్టర్లపై ఉన్న ‘More Dangerous Than D Company’ అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది. ముంబై అండర్‌వరల్డ్‌లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో గుర్తింపు పొందిన ‘డీ కంపెనీ’కి పోటీగా, పోలీసుల బృందం ఎంతటి శక్తిగా మారిందనే కోణంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది.
పోలీసుల యాక్షన్‌ను మాత్రమే కాకుండా.. నేరస్థులను ఎదుర్కొనే క్రమంలో వారు అనుసరించిన పద్ధతులు, వారి వ్యవస్థ, ఆపరేషన్ల వెనుక ఉన్న ఆలోచనలను కూడా ఇందులో చూపించనున్నట్లు ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి.
ఆర్జీవీ ఈ సినిమా గురించి వివరిస్తూ పోలీసుల బృందాన్ని ఒక ‘కంపెనీ’గా అభివర్ణించారు. అక్కడ హింసే అర్హతగా, భయమే విధానంగా మారుతుందని.. కేసులను ముగించడానికి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండానే నేరస్థులను హతమార్చే పరిస్థితులను ఈ కథ ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే కనిపించనున్నారు. ఆయనతో పాటు ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్ తదితరులు నటిస్తున్నారు. టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
నిజ జీవిత వ్యక్తి పాత్రలో హర్షవర్ధన్ రాణే ఎలా కనిపిస్తారు? దయా నాయక్ పోలీస్ కెరీర్‌లోని కీలక ఘట్టాలను దర్శకుడు ఎంతవరకు తెరపై చూపిస్తారు? అనే అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: 500 కోట్ల క్లబ్లో ‘జైలర్ 2’.. ఆ ఫీట్ సాధించిన ఒకే ఒక్కడు రజనీకాంత్.!
[Police Company Release Date, Daya Nayak Biopic, Police Company Movie, Ram Gopal Varma, Harshvardhan Rane, Daya Nayak, Fardeen Khan, Fatima Sana Shaikh, Telugu Film News]






