పాయల్ రాజ్‌పుత్ పేరు ఇక నుంచి వెంకటలచ్చిమి..మరో సంచలనం నమోదు
on Jan 24, 2025
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal rajput).మధ్యలో కొన్ని సినిమాలతో నిరాశపరిచినా కూడా గత సంవత్సరం వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘మంగళవారం’తో తన స్టామినాని చాటి చెప్పింది.రీసెంట్ గా మరోసారి పాన్ ఇండియా సినిమాతో రావడానికి రెడీ కాబోతుంది.
'వెంకటలచ్చిమి' అనే పేరుతో మొత్తం ఆరు భాషల్లో తెరకెక్కుతున్నఈ మూవీ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.రాజా,ఎన్ఎస్ చౌదరి నిర్మాతలు కాగా, ముని దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.ఈ సందర్బంగా దర్శకుడు ముని(Muni)మాట్లాడుతు 'వెంకటలచ్చిమి’గా కథ అనుకున్నప్పుడే పాయల్ రాజ్‌పుత్ సరిగ్గా సరిపోతారనిపించింది.ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీతో కూడిన ఈ రివేంజ్ డ్రామా ఇండియన్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించడం ఖాయం.తెలుగుతో పాటు హిందీ, పంజాబీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నామని చెప్పాడు.
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతు మంగళవారం సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను.కానీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశాను.అలాంటిది ముని గారు ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది.ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అనే అంత బలమైన సబ్జెక్టు.నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉందని చెప్పింది.యూత్ ఆడియన్స్‌కు ఫేవరేట్ హీరోయిన్‌గా మారిన పాయల్ కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్టు, ఛాలెంజింగ్ రోల్‌తో 'వెంకటలచ్చిమి' లాంటి పాన్ ఇండియా సినిమా చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వికాస్ బడిశా సంగీతాన్ని అందిస్తున్నాడు.ఇతర నటీ నటీ నటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
