ఏఆర్ రెహ్మాన్ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్ వచ్చాడా!
on Jan 24, 2025
సంగీత సినీ ప్రపంచంలో ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)కి ఉన్న పేరు ప్రతిష్టలు గురించి అందరకి తెలిసిందే, సంగీత దర్శకుడికి కూడా వీరాభిమానులు ఉంటారని చాటి చెప్పిన అతి తక్కువ మందిలో రెహ్మాన్ కూడా ఒకడు.ఆస్కార్ ని సైతం అందుకొని భారతీయ సినీ ప్రపంచానికి ఎనలేని కీర్తిని గడించి పెట్టాడు.రోజా,దళపతి,ప్రేమికుడు, జెంటిల్ మెన్, భారతీయుడు,ఒకే ఒక్కడు,తాల్,లగాన్,దిల్ సే,స్లమ్ డాగ్ మిలినియర్,రాయన్ ఇలా చెప్పుకుంటు పోతే ఒకటి కాదు ఎన్నో సినిమాలకి అద్భుతమైన బాణీలని అందించి ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా నిలిచిపోయే బాణీలని అందిస్తూ వస్తున్నాడు.
రెహ్మాన్ ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan)బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ కూడా అధికారకంగా వెల్లడించింది.కానీ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో రెహ్మాన్ ప్లేస్ లో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి.కానీ ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ఆర్ సి 16 కి సంబంధించిన సన్నిహిత వర్గాలు వ్యక్తం చేసాయి.ఇప్పటికే రెహ్మాన్ మూడు సాంగ్స్ కూడా ఇచ్చాడని,అంతే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారని అంటున్నారు
ఇక గేమ్ చేంజర్ ఫలితం నిరాశపరచడంతో రామ్ చరణ్ తన నూతన చిత్రం ఆర్ సి 16 ని హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.పుష్ప 2 ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
