Home

»

Latest News

Pawan kalyan: మృత్యువుతో పోరాడుతున్న అభిమాని వద్దకు పవన్ కళ్యాణ్.. అడ్డుకుంటారా!

Jun 16, 2026 3:51PM

 

పవన్ కల్యాణ్(Pawan Kalyan)కి, అభిమానులకి మధ్య ఉన్న అనుబంధం స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.  వరంగల్ లోని హనుమకొండకి చెందిన నిరంజన్ కూడా పవన్ వీరాభిమానుల్లో ఒకరు.  చిన్నప్పుడు అందరిలాగానే మామూలుగానే ఉండేవాడు. కానీ 8 ఏళ్ల క్రితం అతడి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. జన్యుపరమైన డీఎండీ వ్యాధి బారిన పడి పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. ఎదుగుదల పూర్తిగా లోపించింది. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పితో మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం తన వయసు పదహారు సంవత్సరాలు. తన చివరి కోరిక  పవన్ కల్యాణ్‌ని కలవాలని. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. 

Also read: Peddi: ఓటీటీలో పెద్ది గ్రాండ్ ఎంట్రీ.. ఇంత ఫాస్ట్‌గా ఎందుకో తెలుసా!


దాంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన బిజీ షెడ్యూల్‌ని సైతం పక్కనబెట్టి  నిరంజన్ ని పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ రేపు వరంగల్ కి వెళ్లనున్నాడు. అయితే  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ కి కాంగ్రెస్  ప్రభుత్వంలోని పెద్దల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పవన్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారాన్ని రేపుతోంది.  



 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com