Home

»

Latest News

అల్లు అర్జున్ ‘AA23’ థీమ్ మ్యూజిక్‌తో పీఎం మోడీ సంచలన పోస్ట్!

Jun 16, 2026 3:17PM

భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తాజాగా ఆయన స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా నగరంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా భారతదేశ కీర్తికిరీటంలో మరొక అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. స్లోవేకియా దేశపు అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ - ఫస్ట్ క్లాస్' (Order of the White Double Cross - First Class) అవార్డును ప్రధాని మోదీ అందుకున్నారు. స్లోవేకియా ప్రెసిడెంట్ పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని స్వీకరించారు.

అయితే ఆ పురస్కారానికి సంబంధించిన వీడియోను పీఎం మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను, ముఖ్యంగా భారతీయ సినీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధాని మోడీ తన అధికారిక ఖాతాలో ఈ అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించిన ఒక సినిమాటిక్ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ మ్యూజిక్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘AA23’ కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన అఫీషియల్ '23 థీమ్' (23 Theme)ను ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ '23 థీమ్' ట్రాక్ ఇప్పటికే డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) లోనే ఏకంగా 1.2 మిలియన్లకు పైగా వీడియోలకు ఈ ఆడియోను నెటిజన్లు ఉపయోగించడం దీని క్రేజ్‌కు అద్దం పడుతోంది. అలాంటి ఒక భారీ చార్ట్‌బస్టర్ సాంగ్‌ను ప్రధాని మోడీ తన గ్లోబల్ అచీవ్‌మెంట్ వీడియో కోసం ఎంచుకోవడంతో టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో ఒక రేంజ్‌లో హల్‌చల్ మొదలైంది. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై ఈ ఒక్క పోస్ట్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రధాని మోడీ పోస్ట్‌లో తమ అభిమాన హీరో సినిమా మ్యూజిక్ వినిపించడంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఒకవైపు దేశ గర్వించదగ్గ అంతర్జాతీయ పురస్కారం, మరోవైపు భారతదేశపు మోస్ట్ అవేటెడ్ సినిమా థీమ్ మ్యూజిక్ కలయికతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com