Home

»

Latest News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ప్రముఖ అగ్ర నిర్మాత ట్వీట్ వైరల్

Jun 1, 2026 2:32PM

 

తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నటుడు,ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)పై సోషల్ మీడియా వేదికగా, రాజకీయ వర్గాల్లో వస్తున్న భూకబ్జా ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామ పరిధిలో ఉన్న 'కోడి చెరువు' భూములని  పవన్ కళ్యాణ్ అక్రమంగా కబ్జా చేశారంటూ వస్తున్న కథనాలపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వివాదంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీ నిర్మాత రామ్ తాళ్లూరి ఘాటుగా స్పందించారు. 


రామ్ తాళ్లూరి(Ram Talluri)ఎక్స్ వేదికగా 'పవన్ కళ్యాణ్ ప్రజా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన కీర్తి ప్రతిష్టలని దెబ్బతీసేందుకే ఇదంతా చేస్తున్నారు. రాజకీయంగా 
ఆయన్ని ఎదుర్కోలేకనే ప్రత్యర్థులు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలని  తెరపైకి తెస్తున్నారు. వివాదాస్పదంగా మారిన ఆ భూమి పూర్తిగా చట్టబద్ధమైనది. 2014వ సంవత్సరంలోనే నిబంధనల ప్రకారం కొనుగోలు చేయడం జరిగింది. కొనుగోలు చేసిన ఆ 10 ఎకరాల భూమికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు, ప్రభుత్వ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయి.ప్రస్తుతం ఆ భూమిలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవు. కేవలం వ్యవసాయ కార్యకలాపాలు, పండ్ల తోటలు మాత్రమే ఉన్నాయి.

also read:  chiranjeevi: చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ.. ది ప్యారడైజ్ తో ఉన్న క్రేజీ లింక్ ఇదే!

మరోవైపు జన్వాడ పరిధిలోని వేరొక వివాదాస్పద ఆస్తికి సంబంధించిన అంశాలను కావాలనే పవన్ కళ్యాణ్ వ్యవసాయ భూమికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని రామ్ తాళ్లూరి ఎక్స్ వేదికగా స్పందించాడు. రామ్ తాళ్లూరి నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించాడు. పవన్, సురేందర్ రెడ్డి కాంబో మూవీకి కూడా రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ అగ్ర ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com