Home

»

Latest News

chiranjeevi: చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల మూవీ.. ది ప్యారడైజ్ తో ఉన్న క్రేజీ లింక్ ఇదే!

Jun 1, 2026 12:56PM


నేచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో  'దసరా'తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(srikanth odela)ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు.ప్రస్తుతం నానితోనే తన రెండవ చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise)రూపొందిస్తున్నాడు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ప్యారడైజ్' నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ తర్వాత  మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో శ్రీకాంత్ ఓదెల తన తదుపరి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇప్పుడు ఆ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.

ప్యారడైజ్ స్టోరీకి, చిరంజీవి తో చెయ్యబోయే స్టోరీకి మధ్య ఇంటర్ లింక్ ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా ప్యారడైజ్ క్లైమాక్స్ లో చిరు మూవీకి సంబంధించిన లీడ్ కూడా ఇస్తారనేది సినీ సర్కిల్స్ తాజా టాక్. శ్రీకాంత్   'ది ప్యారడైజ్' షూటింగ్‌ని పూర్తి చేసి, ఆగస్టులో థియేటర్లలోకి తీసుకొచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిరు మూవీ స్టార్ట్ కానుంది. మెగాస్టార్ ని మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త రౌద్ర అవతారంలో శ్రీకాంత్ చూపించబోతున్నాడు. 


Also read: kanguva: కంగువ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. వైరల్ గా మారిన అగ్ర హీరో 

 చిరంజీవిని తెరపై మిస్ అవుతున్న ఊరమాస్ ఎలిమెంట్స్‌ని మళ్లీ గుర్తు చేస్తూ, అభిమానుల కోసం ఒక 'జీవితకాలం గుర్తుండిపోయే సినిమా' ఇస్తానని శ్రీకాంత్ ఓదెల ఆల్రెడీ  ప్రామిస్ కూడా చేసాడు  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా నేచురల్ స్టార్ నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com