Home

»

Latest News

గురువాయూర్ లో పవన్ కళ్యాణ్: ఫ్యాన్స్ దెబ్బకి సోషల్ మీడియా షేక్ 

Sep 12, 2026 12:02PM

 

ఎవరకి ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ నెల 2 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు రీ రిలీజైన పంజా మూవీలో 'ఓజి 2 'ఉందనే విషయాన్నీ చిన్న వీడియో ద్వారా తెలియచేసారు. పవన్ నే ఓజి 2 ని సొంతంగా నిర్మిస్తుండటంతో త్వరగా స్టార్ట్ అయ్యి, త్వరగా తమ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. దర్శకుడు సుజిత్ అయితే పవన్ డేట్స్ కోసం సిద్ధంగా ఉన్నాడని ఫిలిం సర్కిల్ టాక్.

 పవన్ రీసెంట్ గా కేరళ రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని (గురువాయూరప్ప దేవస్థానం) దర్శించుకున్నారు. కేరళలో ప్రకృతి వైద్య చికిత్సతో పాటు ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్, సంప్రదాయ దుస్తులైన తెల్లటి పట్టు వేష్టి (ధోతీ) ధరించి ఈ రోజు వేకువజామున 3:00 గంటల సమయానికే ఆలయానికి చేరుకొని  సంప్రదాయాలను పూర్తీగా గౌరవిస్తూ, పవిత్ర నియమ నిబంధనలకు అనుగుణంగా శ్రీ గురువాయూరప్ప దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 

 


Also Read: సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం: మీకు తెలిసిన వ్యక్తే.. ఏం దోచాడో తెలిస్తే షాక్ అవుతారు

సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పవన్ పిక్స్ వైరల్ గా మారాయి. అభిమానుల లైక్స్ తో అయితే సోషల్ మీడియా క్రాష్ అయ్యే పరిస్థితి. 

 

 

[Pawan Kalyan, Guravayur, SriKrishna Mandir, Og2, Sujeeth, Telugu Cinema, Telugu Cinema News, TeluguOne, Tollywood News, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com