
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే 'ఓజి' 2 లో పాల్గొంటాడనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. దీంతో అభిమానులు ఓపెనింగ్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక తాజా న్యూస్ షాక్ ఇస్తుంది.
పవన్ కల్యాణ్ పేరుతో ఒక నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సృష్టించి, దాన్నుంచి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టులు మరియు కల్పిత వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యూహాత్మక అసత్య ప్రచారం వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా: సీఎం విజయ్‌పై మద్రాస్ హైకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు!
.webp)
కేసు వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ప్రాంతానికి చెందిన తీర్థాల నాగ వెంకట దుర్గా రాకేష్ అనే వ్యక్తి ఈ సైబర్ నేరానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో తలదాచుకున్న నిందితుడు రాకేష్‌ను గురువారం ప్రత్యేక పోలీసు బృందం వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని తదుపరి విచారణ నిమిత్తం గుంటూరుకి తరలించారు. నిందితుడు పవన్ కల్యాణ్ పేరు, ఫోటోలను అధికారికంగా ఉపయోగిస్తున్నట్లు భ్రమింపజేస్తూ ఒక ఎక్స్ ఖాతాను నిర్వహించాడు. ఆ ఖాతా నుంచి పొలిటికల్ మైలేజ్ కోసం మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా చేసుకొని మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వార్తలు, వివాదాస్పద వ్యాఖ్యలను నిరంతరం సర్క్యులేట్ చేశాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.
[Pawan Kalyan Fake x Account nara lokesh posts arrest, Pawan Kalyan Fake X Account, Nara Lokesh Fake Posts Case, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]




.webp)

