
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా' 4K వెర్షన్‌లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్‌ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్‌కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌కి సజీవ నిదర్శనం తెలుగు స్టేట్స్ లాగానే రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం.
Also Read: హీరో సూరికి ఘోర అవమానం: చొక్కా విప్పించి... ఏం చేసారంటే!
మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్‌లో 33 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే 15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్‌లో 1.75 కోట్ల షేర్ నమోదు చేసింది. .
[Panjaa, Pune Fans, Pawan Kalyan,TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]






