
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజంటే(సెప్టెంబర్ 2 ) రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులకి పండుగ రోజు. కొంత మంది అభిమానులైతే ఆ రోజున తాము చేసే పనికి సెలవు పెట్టి ఏ ఏ ఏరియాల్లో పవన్ పుట్టిన రోజు జరుపుతున్నారో, చేసే మంచి పనులు ఏంటో చూడటం తరాల నుంచి ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం పవన్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా అభిమానులు భావించే 'పంజా' సెప్టెంబర్ 2 నే థియేటర్స్ లో అడుగుపెడుతుంది
ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతుండటం విశేషం. కేవలం ముందస్తు బుకింగ్స్ ద్వారానే ఇండియా గ్రాస్ ఏకంగా 1.56 కోట్లని దాటేసి పవన్ కళ్యాణ్ మానియాను ప్రపంచానికి చాటిచెప్పింది. బాక్సాఫీస్ అంకెల వివరాల్లోకి వెళితే, విడుదల రోజున ప్రదర్శించబడే షోల కోసం ఇప్పటివరకు భారతదేశంలో 1,15,161 కి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు 141 నగరాల్లో 304 థియేటర్లలో 662 షోలకు గాను ముందస్తు బుకింగ్స్ నిర్వహించగా, ఏకంగా 40.2% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇందులో ఇప్పటికే 86 షోలు హౌస్‌ఫుల్ కాగా, 91 కి పైగా షోలు ఫాస్ట్ ఫిలింగ్ మోడ్‌లో బుక్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ₹80.13 లక్షల గ్రాస్ వసూలై 51.3% వాటాను నమోదు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో ₹64.38 లక్షల అడ్వాన్స్ గ్రాస్ నమోదు కావడం విశేషం. నగరాల పరంగా చూస్తే, హైదరాబాదులోనే 116 షోలలో 44,805 టిక్కెట్లు అమ్ముడై అత్యధికంగా 65.26 లక్షల వసూళ్లు సాధించాయి. అలాగే వైజాగ్ 11.58 లక్షలు, విజయవాడ 10.67 లక్షలు, కర్ణాటకలోని బెంగళూరులో 10.66 లక్షల అడ్వాన్స్ బుకింగ్ వసూళ్లతో పవన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: గోల గోల చేస్తున్నారుగా: యేష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల సాంగ్ రికార్డు ఇదే
డిసెంబర్ 9, 2011న విడుదలైన పంజా 33 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా ₹40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ తర్వాతి కాలంలో టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ దక్కించుకుంది. ఆర్కా మీడియా వర్క్స్, సంఘమిత్ర ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డం లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్లు ప్రేక్షకులను కట్టిపడేసాయి. అంతేకాకుండా యువన్ శంకర్ రాజా అందించిన సమర్థవంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బిజిఎమ్, అడివి శేష్ విలనిజం, సారా జాన్ డియాస్, అంజలీ లావానియా గ్లామర్ పంజాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అప్పట్లో థియేటర్లలో దక్కని విజయాన్ని ఇప్పుడు ఈ 4K రీ-రిలీజ్‌తో పవర్ స్టార్ అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నడ మేకర్ విష్ణువర్ధన్ దర్శకుడు.
Pawan Kalyan, Panjaa Re Release, Box Office Collection, Vishnu vardhan, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood






