
ప్రెజెంట్ ఓటిటి సినీ లవర్స్ మూడ్ ఎలా ఉందంటే ఎంజాయ్ అంటే మాదే అనుకుంటూ చిన్న సైజు స్టెప్స్ కూడా వేస్తున్నారు. మరి ఈ వీక్ కూడా ఒకటి కాదు, రెండు కాదు, నెంబర్ ఆఫ్ సినిమాలు వాళ్ళ కోసమే నిర్మాణం జరుపుకున్నట్టుగా ఓటిటిలో క్యూ కడితే అంతే కదా! ప్రేక్షకులే మాములు ఎంజాయ్ మెంట్ తో ఉండరు. మరి వాళ్ళు చెప్తున్న లిస్ట్ ఏంటో చూద్దాం.
నెట్ ఫ్లిక్స్
‘ది ప్యారడైజ్’ (ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 22 ] . తెలుగు , తమిళం , హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో చూడొచ్చు.
ఇక నెట్ ఫ్లిక్స్ విడుదల అవ్వబోయే మరో చెప్పుకోదగ్గ చిత్రం దొరతి. కీర్తి సురేష్ , రిషి కాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ , కలెక్షన్స్ మాత్రం రాలేదు. కానీ ఓటీటీ ఆడియన్స్ కి మాత్రం కచ్చితంగా ఈ చిత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 23 నుండి, అంటే రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా గజబ్ రాత్ అనే బాలీవుడ్ చిత్రం , షాడోస్ ఆఫ్ ది టిన్ నింజా అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ , సర్వైవింగ్ హరికేన్ ఒటీస్ అనే ఇంగ్లీష్ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
జియో హాట్ స్టార్ విషయానికి వస్తే..
ఈ వారం తెలుగు సినిమాలు చెప్పుకోదగినవి లేవనే చెప్పాలి. మోనా అనే ఇంగ్లీష్ సినిమా ప్రస్తుతానికి స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు లో కూడా అందుబాటులో ఉంది . అదే విధంగా హిందీ లో మహిషాశుర వథ్ అనే వెబ్ సిరీస్ ని దసరా కానుకగా విడుదల చేశారు. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా వరం అనే వెబ్ సిరీస్ ఈ నెల 22 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతుండగా , ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ వెబ్ సిరీస్ సీజన్ 7 అక్టోబర్ 23 నుండి స్ట్రెమైన్గ్ కాబోతుంది.
ఇది కూడా చదవండి: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ: ఈ హీరోనే!

అమెజాన్ ప్రైమ్ వీడియో చెప్పుకోదగినవి లేవు. రీసెంట్ గానే ‘ది టెర్మినల్ లిస్ట్ ‘ సీజన్ 2 వెబ్ సిరీస్ మొదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించిన ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో కి సంబంధించి కొత్త ఎపిసోడ్స్ ని అప్లోడ్ చేశారు. అదే విధంగా చార్ యార్ అనే హిందీ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇవన్నీ చూసుకునే ఓటిటి సినీ ప్రేమికుల గర్వానందం..
[Ott Releases This Week, this week ott releases, telugu ott updates, netflix movies this week, amazon prime releases, new ott movies, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




