
హరీష్ శంకర్.. తెలుగు సినిమాకి దొరికిన కొత్త రకం కమర్షియల్ డైరెక్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పదేళ్ల పరాజయాలకి సెండ్ ఆఫ్ చెప్పేలా చేసాడంటే హరీష్ క్యాపబిలిటీ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే అదే పవన్ కళ్యాణ్ తో ప్రీవియస్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' తో వచ్చి డిజాస్టర్ ని అందుకున్నాడు.
సినీ విశ్లేషకులు, ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. హరీష్ శంకర్ తదుపరి చిత్రాలకు సంబంధించి చాలా క్రేజీ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'మిరపకాయ్', 'మిస్టర్ బచ్చన్' వంటి ప్రాజెక్ట్‌ల తర్వాత వీరిద్దరి కాంబోపై కూడా ఎప్పటికప్పుడు అంచనాలు ఉంటూనే ఉన్నాయి. దాంతోపాటు యంగ్ హీరోలు రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్ వంటి క్రేజీ స్టార్స్ తో కూడా మాస్ యాక్షన్ డ్రామాలు చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే హర్ష్ రోషన్ లాంటి యంగ్ టాలెంట్స్ పై కూడా హరీష్ శంకర్ ప్రత్యేక దృష్టి సారించడం మరియు వారి నటనను అభినందించడం చూస్తుంటే, పెద్ద హీరోలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ నయా యంగ్ హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: తెలుగు అగ్ర హీరో పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్: వెలుగులోకి వచ్చిన సాక్ష్యాలు!

ఈ మధ్య చాలా సినిమాల ఫంక్షన్స్ కి హరీష్ అటెండ్ అవుతున్నాడు. దీంతో హరీష్ తో తన నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. ఏది ఏమైనా ట్రెండ్ కి తగ్గ కథ, కథనంతో హరీష్ శంకర్ హిట్ అందుకుంటాడేమో చూద్దాం.
[Harish Shankar Next Movie, Harish Shankar next movie hero, Harish Shankar upcoming movies, Ustaad Bhagat Singh updates, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






