Home

»

Latest News

ప్రముఖ హీరో సంచలన వ్యాఖ్యలు: థియేటర్లు ఇవ్వకపోతే ఏం చేస్తామంటే!

Sep 29, 2026 2:35PM


ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు. ఆ వస్తే ఏంటి, చాలా మంది వస్తుంటారులే, అందులో ఈ బాబు ఒక కౌంట్ అంతే కదా  అనుకుంటున్నారా! అసలు అలా అనుకోకండి.  ఈ బాబు అలాంటి ఇలాంటి హీరో కాదు. లైట్స్ ఆన్, కెమెరా, రోలింగ్, యాక్షన్ అనగానే సినిమానే కదా అని హీరోకి  వార్నింగ్ ఇవ్వడమే  కాదు. రియల్ గా స్టేజ్ పైనే అందరకి వార్నింగ్ ఇచ్చిపడేయగల కెపాసిటీ ఆ హీరో సొంతం.

'ఓ అందాల రాక్షసి' ..  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ. హీరో,  దర్శకుడు షిరాజ్ మెహదీ. రీసెంట్ గా  హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు 'రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన చిన్న సినిమాలను థియేటర్లు ఇవ్వకుండా తొక్కిపెట్టాలని చూస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ప్రాణం పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మంచి సాంకేతిక నిపుణులతో, బలమైన కంటెంట్‌తో రూపొందించిన తమ 'ఓ అందాల రాక్షసి' చిత్రానికి సరైన స్క్రీన్లు ఇస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే సత్తా ఉందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిన్న సినిమాల మనుగడ కోసం, థియేటర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు నిర్వహించానని, 50కి పైగా ఇంటర్వ్యూలలో తన నిరసన గళాన్ని వినిపించానని షిరాజ్ పేర్కొన్నారు.


ఇది కూడా చదవండి: స్నేహారెడ్డి బర్త్ డే: ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్! 

 

 

ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్ల దోపిడీ విధానాలపై ఆయన సంచలన గణాంకాలతో విరుచుకుపడ్డారు. క్యూబ్ (Qube), యూఎఫ్‌ఓ (UFO) వంటి డిజిటల్ నెట్‌వర్క్ కంపెనీలు డిజిటల్ కంటెంట్ ప్రొసెసింగ్ మరియు ప్రదర్శన పేరుతో చిన్న నిర్మాతలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. వారానికి కేవలం రూ.2,000 మాత్రమే ఖర్చయ్యే డిజిటల్ ప్రాసెస్ సేవలకు గాను, ప్రతీ ఒక్క థియేటర్ నుంచి రూ.10,000 నుండి రూ.12,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన సంఖ్యలతో సహా బయటపెట్టారు. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ (ADCC) ప్రాసెస్ పేరిట అదనపు మొత్తాలను గుంజుతూ చిన్న సినిమాల బడ్జెట్‌లను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని వాపోయారు. చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) వ్యవస్థ ఈ విషయంలో పూర్తిగా మౌనం వహిస్తూ, చిన్న చిత్రాలను నల్లిలా నలిపేసేందుకు సహకరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.

 

 [ O Andala Rakshasi Hero Shiraz Mehdi Slams Theatre Allocation, O Andala Rakshasi,  Shiraz Mehdi, Small Movies Issue, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com