
నుష్రత్ బరుచా.. సినీ, టీవీ నటి. 2006లో ‘జై సంతోషీ మా’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి ఇరవైకి పైగా చిత్రాల్లోనే చేసింది. 2010లో తెలుగులో ‘తాజ్ మహాల్’, 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లో కూడా నటించి తన సత్తా చాటింది.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చారిత్రాత్మక విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండో సారి ఆర్సీబీ కప్‌ని అందుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నుష్రత్ కూడా తన స్నేహితుడి ఇంట్లో ఆర్సీబీ విజయోత్సవాన్ని చూస్తూ, ఆ అద్భుతమైన క్షణాలని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసుకున్నారు. టీవీ స్క్రీన్ పై బాణసంచా కాలుస్తూ ఆర్సీబీ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటున్న విజువల్స్ ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే నెట్టింట ఊహించని తుఫాను చెలరేగింది.
నుష్రత్ పోస్ట్ చేసిన ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వింతైన, అశ్లీల శబ్దాలు (Moaning Sounds) వినిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్లు ఆ స్క్రీన్ రికార్డింగ్ ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేశారు. నుష్రత్ బరుచా ఇన్‌స్టా స్టోరీలో ఏంటిది? వెనుక వింత శబ్దాలు వస్తున్నాయి, బహుశా ఎవరో బెట్ ఓడిపోయినట్లున్నారు" అంటూ ట్విట్టర్ (ఎక్స్), ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా ట్రోలింగ్ సైతం మొదలైంది. దీంతో నుష్రత్, వెంటనే ఆ స్టోరీని డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆమె అధికారిక అకౌంట్ నుంచే ఈ వీడియో వచ్చిందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.
Also Read: Dhurandhar 2: ధురంధర్ 2 విజయంపై అంబానీ కీలక వ్యాఖ్యలు
చివరకు ఈ తీవ్ర వివాదంపై, తప్పుడు ప్రచారాలపై నుష్రత్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించిన వాయిస్ నాది కాదు. నా స్నేహితుడి ఇంట్లో ఉన్న ఒక చిన్న కుక్క పిల్ల (Puppy/Pussy cat) ఏడుస్తున్న శబ్దం. వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేటప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ శబ్దాన్ని గమనించలేదు. పొరపాటున ఆడియోతో సహా వీడియో అప్‌లోడ్ అయ్యింది. దయచేసి ప్రతి ఒక్కరూ కాస్త ప్రశాంతంగా ఉండాలి. సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ఆపడంతో పాటు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై తప్పుడు థియరీలని అల్లే ముందు బాధ్యతాయుతంగా ఆలోచించాలని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.





