Home

»

Latest News

Dhurandhar 2: ధురంధర్ 2 విజయంపై అంబానీ కీలక వ్యాఖ్యలు

Jun 4, 2026 4:03PM

 

 

ధురంధర్(Dhurandhar)రెండు భాగాలు సాధించిన ఘనవిజయం తెలిసిందే. ఈ రోజు నుంచి పార్ట్ 2 జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ గా  రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో అధినేత ముకేశ్ అంబానీ తన షేర్ హోల్డర్లకి  రాసిన వార్షిక నివేదిక లేఖలో ధురంధర్  రికార్డులని  త్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 ముకేశ్ అంబానీ తన లేఖలో  జియో స్టూడియోస్ కేవలం 350 కోట్ల సంయుక్త బడ్జెట్‌తో నిర్మించిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా  3,100 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఒకే ఒక్క ఫ్రాంచైజీతో భారతదేశం మొత్తం థియేట్రికల్ ఆదాయంలో దాదాపు 40 శాతం వాటాను సొంతం చేసుకున్నాం. స్త్రీ 2',  'ధురంధర్', ధురంధర్ పార్ట్ 2 తో వరుసగా మూడు సంవత్సరాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలని  అందించిన ఏకైక నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ నిలిచింది. . ఈ ఘనత సంస్థ అగ్రెసివ్ మార్కెటింగ్ వ్యూహాలకి, తిరుగులేని కంటెంట్ మేనేజ్‌మెంట్‌కి  నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

Also read: Arjun Sarja: అర్జున్ చిన్నకుమార్తె అంజనా ప్రేమ పెళ్లి!.. వరుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్  గణాంకాల ప్రకారం.. కేవలం ఈ సిరీస్‌లోని రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్' మాత్రమే ప్రపంచవ్యాప్తంగా  1,812.96 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. దీనితో ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా  చరిత్ర పుటల్లోకెక్కింది. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com