Home

»

Latest News

VDxShouryuv: ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా.. భయపెడుతున్న డిజాస్టర్ సెంటిమెంట్!

Apr 22, 2026

ఒక హీరో కోసం అనుకున్న కథలు మరో హీరో వద్దకు వెళ్లడం సహజమే. కొన్నిసార్లు డేట్స్ కుదరక, మరికొన్నిసార్లు ఇతర కారణాల వల్ల ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) కాంబినేషన్‌లో ప్రకటించిన సినిమా విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఈ సినిమా నిజానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేయాల్సింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కాదన్నాడా?
'హాయ్ నాన్న' సినిమాతో మెప్పించిన దర్శకుడు శౌర్యువ్, తన తదుపరి చిత్రం కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథను ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించినట్లు సమాచారం. పాయింట్ నచ్చినప్పటికీ, తారక్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. సమయం కేటాయించలేకపోయారు. 

రౌడీ హీరో ఎంట్రీ:
ఎన్టీఆర్ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయ్యి, ఆయనతో సినిమా చేసే అవకాశం రావాలంటే చాలా సమయం పడుతుందని భావించిన శౌర్యువ్, అదే కథను విజయ్ దేవరకొండకు వినిపించారు. విజయ్ ఈ కథలోని డెప్త్, ఎమోషన్స్‌కు ఫిదా అయి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే హీరో మారడంతో, విజయ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా కథలో శౌర్యువ్ కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 

రిపీట్ అవుతున్న సీన్:
పెద్ద హీరోలు వదులుకున్న కథలు విజయ్ దేవరకొండ వద్దకు రావడం ఇది మొదటిసారి కాదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేసిన గత చిత్రం 'కింగ్‌డమ్‌' కూడా మొదట రామ్ చరణ్ చేయాల్సింది. చరణ్ తో అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ, ఏవో కారణాల వల్ల పట్టాలెక్కలేదు. అయితే 'కింగ్‌డమ్‌'తో విజయ్ కి బాక్సాఫీస్ దగ్గర నిరాశే ఎదురైంది. దీంతో ఎన్టీఆర్ వదులుకున్న కథ విజయ్ కి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందనే ఆసక్తి నెలకొంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం, ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com