Home

»

Latest News

ఇరుముడిని ఎన్టీఆర్ చేసి ఉంటే: పరిస్థితి ఇదేనా!

Sep 8, 2026 5:38PM

 

 

అప్పుడే పుట్టిన పసిపిల్లాడి(పాప) బోసి నవ్వు చూస్తే జన్మ ధన్యమైందని ఎలా అనుకుంటామో, బడా హీరో సినిమా రిలీజ్ రోజు బెనిఫిట్ షో కి వెళ్లి  హీరో డై హార్డ్ ఫ్యాన్ ఫేస్ చూస్తున్నా అదే ఫీలింగ్ ఉంటుందని సినీ ప్రియులు చెప్తుంటారు .ఇప్పుడు ఎన్టీఆర్ కి చెందిన  డై హార్డ్  ఫ్యాన్స్ సోషల్ మీడియాలో 'ఎన్టీఆర్' ఇరుముడి చేసి ఉంటే అనే చర్చ లేనవెత్తుతున్నారు. 


ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ శక్తివంతమైన భక్తి కథాంశంలో నటించి ఉంటే తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు ఏ విధంగా రూపాంతరం చెందేవో ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం.

'ఇరుముడి' కథలో కథానాయకుడి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. ప్రారంభంలో పక్కా నెగెటివ్ షేడ్స్ కలిగి, తీవ్రంగా మందుకి అలవాటుపడిన ఒక సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేన్ తన చిన్నారి కూతురి కోరిక కోసం అయ్యప్ప మాల ధరిస్తాడు. ఆ మాల ధారణ తర్వాత అతని ప్రవర్తనలో, మనస్తత్వంలో వచ్చిన ఆధ్యాత్మిక మార్పులు, దాని ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రైమ్ సస్పెన్స్ డ్రామాను ఛేదించే విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్టీఆర్ వంటి అద్భుతమైన నటుడు ఈ పాత్రలో ఉండి ఉంటే, ఆ భావోద్వేగాలు మరొక ఎత్తులో ఉండేవి. 'రాఖీ', 'జై లవకుశ' వంటి చిత్రాల్లో తండ్రిగా, అన్నగా ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టించిన ఎన్టీఆర్, ఇరుముడి మాల ధరించి 'స్వామియే శరణం అయ్యప్ప' అని శరణుఘోష చేస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి

సాధారణంగా ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, ఆయనకున్న విపరీతమైన అభిమాన గణం ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే.ఇరుముడి  మొదటి రోజు రూ. 15 కోట్ల నుంచి  20 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపించింది. అదే ఎన్టీఆర్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో ఈ సినిమా వచ్చి ఉంటే, ఓపెనింగ్ డే కలెక్షన్లు సునాయాసంగా 80 కోట్ల నుండి 100 కోట్ల మార్కును దాటేసి ఉండేవి. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' మరియు 'దేవర' చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్ దృష్ట్యా, ఉత్తరాది రాష్ట్రాలలోనూ ఈ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కథ అపారమైన విజయాన్ని సాధించేది. శబరిమల యాత్ర, అయ్యప్ప స్వామి భక్తి విశిష్టత దక్షిణాదికే కాకుండా దేశమంతటికీ బాగా కనెక్ట్ అయ్యే అంశం కావడం వల్ల పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద శతాధిక కోట్ల వర్షం కురిసేదని ఫ్యాన్స్ చెప్తున్నారు. 

 

 


Also Read: ఫౌజీ సెట్స్‌లో విషపురుగు కాటు:  అసలు నిజం బయటపెట్టిన రాజేష్ శర్మ!

నిజానికి ఒక హీరో సినిమా రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టాక, మా హీరో ఈ సినిమాలో చేస్తే సూపర్ గా  ఉండేదని అనుకోవడం పరిపాటి. ఆ మాటకొస్తే ఇండియన్ చిత్ర సీమ మొత్తంపై అలాంటి మాటలు ఫ్యాన్స్  ఆనందం, హుషారు మధ్య ట్రావెల్ చేస్తుంటాయి. ఆ కోవలోనే ఎన్టీఆర్ ఇరుముడి చేసి ఉంటే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అని కొంత మంది  ఫ్యాన్స్  బావిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసి ఉన్నా కూడా సూపర్ గా ఉండేదనే మాటలు సైతం  కొంత మంది ఫ్యాన్స్ నుంచి వచ్చాయి. అంతే కానీ మాస్ మహారాజాని తక్కువ చెయ్యడం కాదు. జస్ట్ ఫ్యాన్స్ ఆరాటం అంతే. మాస్ మహారాజా తనదైన పెర్ ఫార్మ్ తో ఇరుముడిని బ్లాక్ బస్టర్ బాట పట్టించాడు    . 

  

 

 

 

[ Ntr, irumudi, Raviteja, Shiva Nirvana, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News, Pan India,NTR Irumudi]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com