Home

»

Latest News

ఫౌజీ సెట్స్‌లో విషపురుగు కాటు:  అసలు నిజం బయటపెట్టిన రాజేష్ శర్మ!

Sep 8, 2026 4:56PM

 

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ ‘ఫౌజీ’ . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్టుగా టాక్.  అయితే కొన్ని రోజుల క్రితం  షూటింగ్ సెట్‌లో ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ శర్మ ని విషపూరితమైన కీటకం కొట్టడంతో  తీవ్ర అస్వస్థతకి  గురయ్యారని హుటాహుటిన కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్పించారనే వార్తలు నెట్టింట హల్ చల్ చేసింది.

ఈ ఘటనపై సినిమా వర్కర్ల సంఘం ఏఐసీడబ్ల్యూఏ (AICWA) కూడా స్పందిస్తూ సెట్‌లో సరైన భద్రత, వైద్య సదుపాయాలు లేవని ఆరోపిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేయడంతో సినీ పరిశ్రమలో పెద్ద కలకలమే రేగింది.  అయితే ఈ ప్రచారం అంతటికీ చెక్ పెడుతూ స్వయంగా నటుడు రాజేష్ శర్మ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని వెల్లడి చేసాడు. ఆయన మాట్లాడుతు 'ప్రభాస్ సినిమా సెట్‌లో నన్ను విషకీటకం కుట్టిందనే వార్తలన్నీ పూర్తిగా అబద్దం. అవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమే. ప్రభాస్ గానీ, ఆ సినిమా నిర్మాణ బృందం గానీ చాలా మంచివారు. సెట్‌లో నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. నా ఆరోగ్యం క్షీణించడానికి ఆ సినిమా యూనిట్‌కి  ఎలాంటి సంబంధం లేదు". నాకు చాలా కాలంగా కుడి కాలికీ ఒక తీవ్రమైన చర్మ సమస్య (స్కిన్ ఇన్ఫెక్షన్) ఉంది. హైదరాబాద్ షూటింగ్ ముగించుకుని కోల్‌కతా వెళ్లిన తర్వాత నా రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్ / డయాబెటిస్) అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ చర్మ ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా విషమించింది. స్టార్టింగ్ లో ఆ సమస్యని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి తీవ్రమై ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అంతేతప్ప పురుగు కుట్టడం అనేది ఏమాత్రం నిజం కాదని స్పష్టత ఇచ్చారు.

 

 

Also Read: దారుణంగా పడిపోయిన టాక్సిక్ ఓటీటీ డీల్: అత్యాశ వల్ల ఎన్ని కోట్లు లాస్ అంటే!


కోల్ కతా కి చెందిన రాజేష్ వెనక వందకి పైగా  హిందీ, బెంగాలీ చిత్రాలు ఉన్నాయి. ఎనీ క్యారక్టర్ తీసుకోండి ఓవర్ డోస్ లేకుండా పెర్ ఫార్మ్ చెయ్యడం రాజేష్ శర్మ స్పెషాలిటీ.

 

 

[ Fauji,  Prabhas, Rajesh Sharma, Health Rumors, Kolakata, Hanu Raghavapudi, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com