
'బెత్లెహెం కుటుంబ యూనిట్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మలయాళ స్టార్ నివిన్ పౌలీ నుంచి వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ తమిళ్ మూవీ 'ఏళు కడల్ ఏళు మలై'. తమిళ దర్శకుడు రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కోలీవుడ్ యాక్టర్ సూరి ఒక కీలక పాత్రలో నటించగా, అంజలి హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ఒరిజినల్ వెర్షన్‌తో పాటు అక్టోబర్ 1న తెలుగులో కూడా 'సంచారి' టైటిల్‌తో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, చివరి నిమిషంలో తెలుగు వెర్షన్ రిలీజ్ కి బ్రేక్ పడింది.
తెలుగు టైటిల్ వివాదం కారణంగానే ఈ సినిమా రిలీజ్‌ను మేకర్స్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టారు. 'సంచారి' టైటిల్ తో టాలీవుడ్ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ ఓ మూవీ ప్లాన్ చేశారు. టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయితే ఇప్పుడు అదే టైటిల్ ను 'ఏళు కడల్ ఏళు మలై' తెలుగు వెర్షన్ కి పెట్టడంతో వివాదం అయినట్లు తెలుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలోనే నివిన్ పౌలీ 'సంచారి' విడుదల తాత్కాలికంగా ఆగిపోయింది.
ప్రస్తుతం మేకర్స్ ఈ టైటిల్ ఇష్యూను త్వరగా పరిష్కరించే పనిలో ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్‌ను అతి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది. మరి చంద్ర సిద్ధార్థ్ తో టైటిల్ సమస్యను పరిష్కరించుకుంటారా? లేక కొత్త టైటిల్ తో వస్తారా? అనేది చూడాలి.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ఎమోషనల్ రివ్యూ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఎలా ఉందంటే.?

[Sanchari Release Postponed, Nivin Pauly Sanchari Telugu Release, Sanchari Movie Title Issue, Yezhu Kadal Yezhu Malai Telugu, Nivin Pauly New Movie, Bethlehem Kudumba Unit, Soori New Movie, Telugu Film News]






