
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో కార్తికేయ నిర్మాతగా వస్తున్న మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఫహాద్ ఫాజిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే, తాజాగా ఈ మూవీ స్పెషల్ షో చూసిన మహేష్ బాబు.. తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇస్తూ, ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన స్టైల్ లో రివ్యూ ఇచ్చేశాడు.
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా చూసిన తర్వాత తారక్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "ఈ సినిమా ప్రతి చిన్నారికి, ప్రతి తల్లిదండ్రులకు.. అలాగే ఇప్పటికీ తమ మనసులో ఆ చిన్నతనాన్ని దాచుకున్న ప్రతి ఒక్కరికీ అంకితం" అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
సినిమాలో హీరోగా నటించిన ఫహాద్ ఫాజిల్ నటన గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా కొనియాడారు. 'సూరి' పాత్రలో ఫహాద్ గారు ఇచ్చిన పెర్ఫార్మన్స్ చూసి నేను నిజంగా ఫిదా అయిపోయాను. ప్రతీ ఫ్రేమ్‌లోకి ఆయన ప్రాణం పోసిన తీరు నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.
ఇక ఈ చిత్ర దర్శకుడు శశాంక్ గురించి మాట్లాడుతూ, "తమ్ముడూ.. నీ మొదటి సినిమాతోనే ఎంత అద్భుతమైన కథని, ఎంత స్పష్టతతో, ప్రేమతో తెరకెక్కించావో!" అంటూ అభినందించారు. పిల్లలు, కుటుంబాల మధ్య ఉండే స్వచ్ఛమైన భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం అందరికీ సాధ్యం కాదు, కానీ శశాంక్ దాన్ని చాలా అందంగా ఆవిష్కరించాడని, ముందు ముందు అతనికి మంచి భవిష్యత్తు ఉందని కొనియాడారు.
ఈ సినిమాలో నటించిన చిన్నారి సారా గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలు ప్రతీ ఒక్కరి హృదయాలను తాకుతాయి. "లిటిల్ సారా.. నువ్వు నా మనసు దోచేసావ్. న్యాచురల్‌గా యాక్ట్ చేశావ్. సినిమా అయిపోయిన తర్వాత కూడా నీ అమాయకత్వం, నీ నటన మనసులోనే ఉండిపోతుంది" అని ఎన్టీఆర్ అన్నారు.
అలాగే కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిందని, ప్రతీ సీన్‌లోని ఎమోషన్‌ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.
ఒక ముక్కలో చెప్పాలంటే, "చాలా కాలం తర్వాత ఒక పక్కా ఫ్యామిలీ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు నా హృదయాన్ని బలంగా తాకాయి, ఆ ఇంపాక్ట్ నుండి నేను ఇంకా బయటపడలేదు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మాస్టర్ పీస్" అని ఎన్టీఆర్ అన్నారు.
చివరగా కార్తికేయకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, "నాన్నా.. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది, అక్టోబర్ 2న ఈ మ్యాజిక్ ప్రపంచమంతా చూడబోతోంది" అంటూ పోస్ట్ ముగించారు.
ఇది కూడా చదవండి: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. మహేష్ బాబు మెచ్చిన మూవీ.!
[Don't Trouble The Trouble Review By NTR, Dont Trouble The Trouble Movie Review, Dont Trouble The Trouble Review Telugu, Don't Trouble The Trouble, Jr NTR, SS Kartikeya, SS Rajamouli, Fahadh Faasil, Mahesh Babu, Telugu Film News]





