ENGLISH | TELUGU  

ఏది ముందు, ఏది తర్వాత.. నితిన్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడా!

on Feb 10, 2026

 

 

 

-నితిన్ కి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది!
-ప్రాబ్లెమ్ ఎక్కడ వస్తుంది
-అభిమానులు ఏమంటున్నారు


సినీ కాలం కలిసి రావడం లేదో లేక ఎవరి దిష్టి అయినా తగిలిందో ఏమో గాని నితిన్(Nithiin)సినీ కెరీర్ అంత ఊపుతో వెళ్లడం లేదు.ఈ విషయంలో అభిమానులతో పాటు ప్రేక్షకులు నితిన్ సినీ గ్రాఫ్ చూస్తూ రెండున్నర దశాబ్దాల క్రితమే మొదటి రెండు సినిమాలతో సిల్వర్ జూబ్లీ అందుకున్న నితిన్, ప్రెజెంట్ నితిన్ ఒకరేనా అని ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి. పెర్ఫార్మ్ పరంగా ఎలాంటి లోటు లేదు. కానీ సరైన కథలు ఎంచుకోకపోవడం వలనే ప్లాప్ లని చాలా గట్టిగా వడిసి పట్టుకుంటున్నాడనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినపడుతుంది. నితిన్ నుంచి  ఇప్పటి వరకు 35 చిత్రాలు వచ్చాయి.రీసెంట్ గా తన 36 వ చిత్రాన్నివిభిన్నచిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్‌(Vi anand)తో చేస్తున్నట్టుగా అనౌన్స్ మెంట్ వచ్చింది.ఇప్పుడు మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.


తొలి చిత్రం 'ఆయ్' తోనే మంచి స్పాన్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు అంజి కె. మణిపుత్ర(Aniji K maniputhra).ఇటీవల నితిన్ కి అంజి ఒక  స్టోరీ నేరేట్ చేశాడట. సదరు కథ, కధనం నచ్చడంతో  అంజికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.ఇందుకు సంబంధించిన   అధికార ప్రకటన త్వరలోనే రానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు స్పందిస్తు నితిన్ ముందుగా తన 36 వ చిత్రాన్ని ఎవరితో చేస్తాడు. లేక రెండు సినిమాలు ఒకే సారి చేస్తాడా అనే కామెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.

 

also read:  2. 5 కోట్లు చెల్లించండి.. లేదంటే జైలుకే 


వీఐ ఆనంద్‌ మూవీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతుండగా నితిన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నటుగా తెలుస్తుంది. 2005 వ సంవత్సరంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన  'అల్లరి బుల్లోడు'లో  నితిన్  డ్యూయల్  రోల్ చేశాడు.అంటే మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత డ్యూయల్ రోల్ లో కనిపించినట్లవుతుంది.  అంజి సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఇంకా ఎలాంటి వార్తలు రావడం లేదు.

 



 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.