ENGLISH | TELUGU  

2 .5 కోట్లు చెల్లించండి.. లేదంటే జైలుకే 

on Feb 10, 2026

 

 


-ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది
-అభిమానులు ఏమంటున్నారు
-కట్టకపోతే ఏం జరుగుతుంది

 

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)నుంచి సినిమా వస్తుందంటే సౌత్ సినీ సర్కిల్స్ లో ఉండే సినీ జాతర తెలిసిందే. సినిమా అనౌన్స్ మెంట్ రోజు నుంచే సదరు సినీ జాతర ప్రారంభమవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రజినీ సినీ ప్రోటాన్షియల్ కి ఉన్న కెపాసిటీ లో అదొక మచ్చు తునక మాత్రమే. అలాంటి చరిష్మా ఉన్న రజినీ మూవీ ఇప్పుడు 2 .5 కోట్ల రూపాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిని చవి చూస్తున్న సినిమా ఏంటో చూద్దాం.

కొచ్చడైయాన్(Kochadaiiyaan)..రజినీకాంత్ నుంచి వచ్చిన మొట్టమొదటి పీరియాడిక్ నేపథ్యంతో కూడిన యానిమేటెడ్ మూవీ. తెలుగులో విక్రమసింహా అనే పేరుతో డబ్ అవ్వగా 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వన్ ఎంటర్టైన్మెంట్ ​పై మురళీ మనోహర్(Murali Manohar)మరో ఇద్దరితో కలిసి నిర్మించాడు. కొచ్చడైయాన్ కి సంబంధించిన పనుల కోసం బెంగుళూరుకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్  కంపెనీ నుంచి మురళి మనోహర్ కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అమౌంట్ కి .5 కోట్లు రూపాయలు చెక్ ద్వారా చెల్లించాడు.కానీ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో దీంతో సదరు యాడ్  కంపెనీ కోర్టులో కేసు వేయగా కొన్నేళ్ల విచారణ తర్వాత ట్రయల్ కోర్టు మురళిని దోషిగా తేలుస్తూ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆ  తీర్పుని మురళీ మద్రాస్ హైకోర్టులో సవాలు చేసాడు. రీసెంట్ గా మద్రాస్ హైకోర్ట్ కేసుపై స్పందిస్తు నిర్దిష్ట గడువులోపు 2.52 కోట్ల రూపాయలు యాడ్ కంపెనీకి మురళి మనోహర్  చెల్లించాలి. ఒక వేళ గడువులోపు చెల్లించకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.

 

also read: spirit: స్పిరిట్ నుంచి తప్పుకోవడంపై ప్రకాష్ రాజ్ ట్వీట్..  అనుకున్నదే నిజమయ్యింది 

 

రజనీకాంత్, దీపికా పదుకొణె, శరత్​కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి తదితరులు మెరిసిన కొచ్చడైయాన్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడంపై అభిమానులు బాధపడుతున్నారు. రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య  దర్శకత్వం వహించింది.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.