
-సోషల్ మీడియాని ఊపేస్తున్న న్యూస్
-ఐ ఫీస్ట్ ఖాయమేనా!
-డిబేట్ లో ఏం చెప్పారు
అభిమానులకి, తెలుగు సినిమా ఫార్మేట్ ని నమ్మకున్న తెలుగు సినిమా లవర్స్ కి, ప్రేక్షకులకి అచ్చ తెలుగు ఊర మాస్ సినిమా ఇవ్వడంలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తర్వాతే ఎవరైనా. సదరు చిత్రాల్లోని బాలయ్య పెర్ ఫార్మెన్స్, డైలాగ్స్ కైతే ఎక్స్ పైరీ డేట్ కూడా ఉండదు. ఆ ఆనవాయితీని కంటిన్యూ చేస్తూ వీరసింహ రెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేని మూవీకి సిద్దమవుతున్నాడు. సిద్దమవుతుండటమే కాదు అఖండ 2 తో రికార్డులకి బ్రేక్ రావడంతో ఈ సారి రికార్డులే లక్ష్యంగా సిద్దమవుతున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ మీ కోసం.
NBK 111 గా సెట్స్ పైకి వెళ్లనుండగా బాలయ్య పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ గా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. సాధారణంగా బాలయ్య సినిమాల్లో డ్యూయల్ రోల్స్ ఉంటాయని మనం ఆశిస్తాం. కానీ ఈ మూవీలో సోలో క్యారెక్టరే చేస్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. ఒక్క క్యారక్టరే అయినా, సదరు క్యారక్టర్ లలో నాలుగైదు రకాల షేడ్స్ ఉండబోతున్నాయి. టోటల్ గా బాలయ్య క్యారక్టర్ చాలా భిన్నంగా, వేరే లెవల్ హడావిడితో ఉంటుందని సమాచారం. ఈ భారీ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్ స్టార్ నయనతార తో పాటు మరో హీరోయిన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. మ్యూజిక్ విషయానికొస్తే, బాలయ్య కోసమే పుట్టినట్టుగా బిజిఎం తో మెస్మరైజ్ చేసే థమన్ నే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ ని అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. షూట్ ని త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో బాలయ్య ఉన్నారు. నిజానికి 2027 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ దసరాకే అభిమానులకి, ప్రేక్షకులకి ఐ ఫీస్ట్ అనుభూతిని కలిగించాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ గారి మార్క్ యాక్షన్ మరియు గోపీచంద్ మలినేని(Gopinchand Malineni)మాస్ టేకింగ్ కలసి బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అంచనాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అభిమానుల కోరిక మేరకు చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడించనుంది. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి.
also read: Allu Arjun: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ఆసక్తికర చర్చ.. తెలుగోళ్లు ఏమంటున్నారో తెలుసా!
NBK కి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన సినీ విశేషాలతో పాటు ఎక్స్ క్లూజివ్ అప్డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా ఛానల్(Telugu One cinema) ని చూస్తూనే ఉండండి. సబ్ స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్ స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న పూర్తి వీడియో చూసి లైక్ కొట్టండి.






