Home

»

Latest News

చిరు, వెంకీ బెర్త్ కన్ఫార్మ్ కదా

Aug 22, 2026 12:36PM

 

సంక్రాంతికి గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ' సినిమా చూస్తే వచ్చే మజానే వేరు.   వానపడుతున్నప్పుడు వేడి వేడి బజ్జిలు తింటే ఎంత మజా వస్తుందో అంతకి మించిన మజా బాలయ్య మూవీ సంక్రాంతికి రిలీజ్ అయితే ఉంటుందని  అభిమానులు భావిస్తు ఉంటారు. అసలు బాలయ్య సినిమా వస్తేనే సంక్రాంతి పండుగ పరిపూర్ణం అయినట్లని  భావించే అభిమానులు సైతం లెక్కకి మించి ఉన్నారు. వాళ్ళు అనుకోవడమే కాదు కొన్ని దశాబ్దాల నుంచి  బాలయ్య ట్రాక్ రికార్డు అలాగే ఉంది. 2027 సంక్రాంతి రేసుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'కాకా'తో జనవరి 13 న,విక్టరీ వెంకటేష్ జనవరి 12 విడుదల అనే టాగ్ లైన్ తో జనవరి 12 న వస్తున్నారు.దీంతో సంక్రాంతి మొనగాడిగా పేరుగాంచిన బాలయ్య  కూడా ఈ రేసులోకి వస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

బాలకృష్ణ, గోపిచంద్ మలినేని మూవీ ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కాకపోతే కొన్ని రోజుల క్రితం యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య కాలికి గాయం కావడంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. NBK 111 గా ఆ సెట్స్ పై ఉన్న ఈ మూవీ సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతుంది. టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో అత్యధిక విజయాలు నమోదు చేసిన చరిత్ర బాలయ్య సొంతం. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు నుండి ఇటీవల వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరకు బాలకృష్ణ సంక్రాంతికి వస్తే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం నెలకొంటుంది.  

Also Read: మెగాస్టార్ లీక్ వల్లనే టైటిల్ మారిపోయిందా?.. కాకా వర్సెస్ కదిరి

ప్రస్తుతం బాలయ్య తన వరుస సినిమాలతో ఊపు మీదున్నారు. గత నాలుగైదు ఏళ్లలో ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల నుండి 150 కోట్ల గ్రాస్ వసూళ్లను సునాయాసంగా రాబట్టాయి. బాలకృష్ణ ట్రాక్ రికార్డ్ చూస్తే, ఆయన పండుగ రేసును ఎప్పుడూ మిస్ అవ్వడానికి ఇష్టపడరు. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, 2027 సంక్రాంతి నాటికి బాలకృష్ణ సెట్స్‌పై ఉన్న ప్రాజెక్ట్ సరైన సమయానికి పూర్తయితే, ఆయన కచ్చితంగా బరిలో నిలుస్తారు. ఒకవేళ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ముగ్గురూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ సంక్రాంతి పోరుగా ఇది నిలిచిపోతుంది. 

Balakrishna, Chiranjeevi, Venkatesh, NBK111, Kaaka, Janauary 12 Vidudhala

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com