Home

»

Latest News

Fahadh Faasil: ఫహద్ ఫాజిల్‌పై నజ్రియా వ్యాఖ్యలు వైరల్!.. విడిపోతారా, విడిపోరా!

Jun 17, 2026 4:09PM

 

ఫహద్ ఫాజిల్‌, నజ్రియా నజీమ్ ఎంత గొప్ప నటులో తెలిసిందే. ముఖ్యంగా ఫాహద్ యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే ఎనీ క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి తన 'ఎరా'ని చాలా బలంగా చాటి చెప్పగలడు. ఫాహద్ కోసం థియేటర్స్ కి వెళ్లే వాళ్ళు కూడా బోలెడు మంది. ఇక నజ్రియా రీసెంట్ గా  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ‘రెడ్ ఫ్లాగ్’ మ్యాటర్ చూసి అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నజ్రియా తన వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఎదుర్కొంటోందా? ఫహద్ ఫాజిల్‌తో ఏమైనా విభేదాలు వచ్చాయా? అని చర్చించుకుంటున్నారు. దీంతో ఈ పోస్ట్ సౌత్ లో మోస్ట్ కాస్ట్లీ వైరల్ న్యూస్ గా మారింది.

ఆమె చేసిన పోస్ట్ సారాంశం ఏంటంటే.. “రెడ్ ఫ్లాగ్‌ల (ప్రమాద సంకేతాల) వెనుక పరిగెత్తే బుల్స్ (ఎద్దులు) పిచ్చివి అని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని.. కానీ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే తయారైంది, నేను ఇక్కడే ఉన్నాను” అనే ఒక కోట్  షేర్ చేసింది. నిజానికి ఆధునిక ప్రేమ, పెళ్లి బంధాలలో ఉండే లోపాలని , మోసాలని  లేదా ప్రమాద హెచ్చరికలని  సూచించడానికి సోషల్ మీడియాలో ‘రెడ్ ఫ్లాగ్’ అనే పదాన్ని యువత ఎక్కువగా వాడుతుంటారు. దీనికి తోడు గతంలో అంటే ఏప్రిల్ నెలలో కూడా తాను కొన్ని పర్సనల్ ఎమోషనల్ ఇబ్బందుల వల్లే పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉంటున్నట్లు నజ్రియా పేర్కొంది. ఈ పాత విషయాలను కూడా ఫ్యాన్స్ ఇప్పుడు లింక్ చేస్తూ, ఈ క్యూట్ కపుల్ విడిపోతున్నారా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఫహద్ ఫాజిల్ ఫ్యాన్స్ అయితే నజ్రియా పోస్ట్ కింద ఫహద్ పాత సినిమాల జిఫ్‌లను షేర్ చేస్తూ అసలేం జరిగిందో చెప్పాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

అయితే కొందరు సినీ విశ్లేషకులు ఈ విషయంలో మాట్లాడుతు ఇదంతా నజ్రియా వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదని, ఆమె చేస్తున్న సరికొత్త మూవీ ప్రమోషన్స్ కోసం పీ ఆర్ స్తంట్స్ అని  కొట్టిపారేస్తున్నారు. నజ్రియా ప్రస్తుతం టోవినో థామస్ సరసన ‘గ్రాసియాస్ ఎల్ క్లాసికో’ (Gracias El Clasico) అనే వైవిధ్యభరితమైన మూవీలో చేస్తుంది. ముహసిన్ పరారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ని  ఇటీవలే మే 11న బార్సిలోనాలో జరిగిన రియల్ మాడ్రిడ్, ఎఫ్‌సి బార్సిలోనా హై-ప్రొఫైల్ మ్యాచ్ సందర్భంగా క్యాంప్ నౌ స్టేడియం వేదికగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

also read: sanchita ugale: సంచితా ఆత్మహత్య కేసులో సంచలన ట్విస్ట్.. వాట్సాప్ చాట్ లో ఉన్న మ్యాటర్ ఇదే   

స్పెయిన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో బుల్ ఫైట్ (కాళపోరు), ఫుట్‌బాల్ ఆటలకి  కథాపరంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్పెయిన్‌లో జరిగే సాంప్రదాయ బుల్ ఫైట్‌లో ఎద్దులను ఉద్రేకపరచడానికి ఎర్రటి గుడ్డను (రెడ్ ఫ్లాగ్) వాడుతుంటారు. కాబట్టి, నజ్రియా పెట్టిన ‘బుల్స్ అండ్ రెడ్ ఫ్లాగ్’ పోస్ట్ పక్కా ఒక క్రేజీ పీఆర్ స్టంట్ (PR Strategy) అని, సినిమాలోని కీలకమైన కాన్సెప్ట్‌ని  హింట్ ఇవ్వడానికే ఈ పోస్ట్ చేసిందని చెప్తున్నారు  నాచురల్ స్టార్ నానితో కలిసి 'అంటే సుందరానికీ’ చిత్రంతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తురాలే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com