Home

»

Latest News

ఢీ అంటే ఢీ.. కాని గెలిచేది మాత్రం వాళ్లే 

Jul 21, 2026 6:36PM

 


లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ లైన్ పొందటం అంతా ఆషామాషి కాదు. పైగా హీరోయిన్ రోల్ కి ఇంపార్టెన్స్ తగ్గుతు పైరసీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అనేది అసాధ్యం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నటి నయనతార(Nayanthara). తనని ఉహించుకుంటూనే క్యారెక్టర్స్ రాసుకొని, తన డేట్స్ కోసం వెయిట్ చేసి మరి షూటింగ్ ని వెల్లడం నయన్ స్పెషాలిటీ. నయన్ అప్ కమింగ్ మూవీ  'హాయ్'. యంగ్ హీరో కవిన్ హీరో. విష్ణు ఎడవన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కగా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇక్కడే అసలైన బాక్సాఫీస్ సస్పెన్స్ మొదలైంది. ఆగస్టు 14వ తేదీన ఇప్పటికే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి 'విశ్వనాథన్ & సన్స్' విడుదల కాబోతుంది. రీసెంట్‌గా 'కరుప్పు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్న సూర్య, ఈసారి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సూర్య సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకే రోజున సూర్య 'విశ్వనాథన్ & సన్స్' తో పాటు నయనతార, కవిన్‌ల 'హాయ్' మూవీ పోటీ పడుతుండటంతో ఆగస్టు 14 లాంగ్ వీకెండ్‌లో థియేటర్ల దగ్గర సెన్సేషన్ క్రియేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒకవైపు సూర్య(Suriya)కమర్షియల్ ఫ్యామిలీ ఎమోషన్స్, మరొకవైపు నయనతార-కవిన్ కాంబో అందించే డిఫరెంట్ రొమాంటిక్ డ్రామా. వీరిద్దరి సినిమాల మధ్య థియేటర్ల కేటాయింపులు, కలెక్షన్ల పరంగా ఏ సినిమా పైచేయి సాధిస్తుందో అని ఇరు హీరోల అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీపడటం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. లాంగ్ హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆగస్టు 14న జరిగే ఈ బిగ్ బాక్సాఫీస్ ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ప్రేక్షకులకి మాత్రం సినీ మజా గ్యారంటీ.


Also read: లెనిన్ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. ఆ స్టార్ హీరోతోనేనా?

'హాయ్' విడుదల తేదీ ప్రకటనతో పాటు చిత్రబృందం ఒక చిన్న గ్లింప్స్ టీజర్‌ రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్‌లో నయనతార చేతిలో కొడవలి పట్టుకుని మాస్ అండ్ బోల్డ్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. అదే సమయంలో హీరో కవిన్ వర్షంలో తడుస్తూ బైక్‌పై వస్తున్న లుక్ కుర్రకారుని  ఆకట్టుకుంటోంది. వయసులో చిన్నవాడైన కుర్రాడు, పెద్దదైన మహిళ మధ్య సాగే డిఫరెంట్ ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి 'U/A' సర్టిఫికేట్ కూడా లభించిందని మేకర్స్ స్పష్టం చేశారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో మరియు రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా  నిర్మించాయి.

 

nayanthara, suriya, hai, viswanadh&sons
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com