Home

»

Latest News

లెనిన్ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. ఆ స్టార్ హీరోతోనేనా?

Jul 21, 2026 6:10PM

 

లెనిన్(Lenin)తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు. పదేళ్ల  అఖిల్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ కావడంతో మురళి పేరు ఇండస్ట్రీలో ఎంతలా మారుమోగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ గురించి  ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

 
తమిళ స్టార్ హీరో ధనుష్ తో తన అప్ కమింగ్ ఉండబోతుందని, లెనిన్ ని నిర్మించిన   సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లోనే మూవీ ఉండబోతుందని అంటున్నారు. మురళీ కిషోర్ రాసుకున్న ఒక వైవిధ్యమైన హై-వోల్టేజ్ కథ లైన్ ధనుష్‌కి బాగా నచ్చిందని, ఈ మేరకు ప్రాథమిక చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. అయితే ఈ భారీ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుండి ఇంకా వెలువడాల్సి ఉంది. ధనుష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవేళ ఇది నిజమైతే మురళీ కిషోర్ కి మంచి అవకాశం అని చెప్పవచ్చు. 


మురళీ కిషోర్ 2023లో కిరణ్ అబ్బవరంతో తెరకెక్కించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.

Also read: ఎన్టీఆర్ ఐకానిక్ సాంగ్ జనని జన్మభూమిశ్చ మళ్లీ రావడం సాధ్యమేనా.. రావాలంటే ఎలా!

murali kishor abburu, akhil, lenin, dhanush, nagavamsi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com