
తమిళనాడు రాజకీయాల్లోకి సినీ ప్రముఖులు వస్తున్నారనే చర్చ ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, అనూహ్యంగా సీఎం అయిన నేపథ్యంలో.. మరికొందరు సినీ తారలు కూడా పాలిటిక్స్‌లోకి అడుగుపెడతారనే ప్రచారం మొదలైంది.
ఈ క్రమంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార పేరు కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యంగా 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నయన్ పోటీ చేస్తారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ ప్రచారంపై ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా స్పందించారు.
ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ అన్నదాన కార్యక్రమానికి విఘ్నేశ్ శివన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు నయనతార రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించారు. 2031 తమిళనాడు ఎన్నికల్లో ఆమె పోటీ చేసే అవకాశం ఉందా అని అడిగారు.

దీనికి విఘ్నేశ్ శివన్ స్పందిస్తూ.. ప్రస్తుతం నయనతార తన పిల్లలతో సమయం గడపడాన్ని ఆస్వాదిస్తున్నారని తెలిపారు. తమ దృష్టి అంతా పిల్లల పెంపకం, కుటుంబం, కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేశారు. ఈ జీవితమే తమకు ఎంతో ప్రశాంతతను, సంతృప్తిని ఇస్తోందని పేర్కొన్నారు.
విఘ్నేశ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ప్రస్తుతం నయనతార రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంపై మాత్రం ఇప్పుడే స్పష్టమైన నిర్ణయానికి రాలేం.
ఇది కూడా చదవండి: 175 డేస్ రికార్డు.. టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించిన టాప్10 సినిమాలు ఇవే.!
[Nayanthara Political Entry, Nayanthara 2031 Elections, Nayanthara Politics, Lady Superstar Nayanthara, Tamil Nadu Politics, Thalapathy Vijay, Nayanthara, Vignesh Shivan, Telugu News]






