
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. "ఈ టీంలో అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్‌కి నాకు ఉన్నది అన్నదమ్ముల అనుబంధం. తన విషయంలో నాకు చాలా గర్వంగా ఉంటుంది. శ్రీకాంత్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వారి కళ్లల్లో ఆనందం 24న మరింత పెరుగుతుంది. మోహన్ బాబు గారు ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలుసు. ఆయన ఇంపాక్ట్ అనేది ఈ జనరేషన్‌కి ‘ప్యారడైజ్’ గుర్తు చేస్తుంది. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తో అర్థమైంది. వెరీ స్వీట్ హార్ట్. అనిరుద్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి మ్యూజిక్ చేశాడు. సినిమా ఒక సెలబ్రేషన్‌లాగా ఉండబోతుంది. 23 రాత్రి నుంచి ఆ సెలబ్రేషన్ మొదలు కాబోతుంది. థియేటర్లు ఊగిపోతాయి. మీ సెలబ్రేషన్ చూడ్డానికి నేను ఎదురు చూస్తున్నాను.
మనం ఎదుగుతుంటే మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది. నెగెటివ్‌ని మనం పట్టించుకోకూడదు. పాజిటివ్‌ని పట్టుకొని మనం ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని కోరుకున్న వాళ్లు పెరిగినట్టే, మనం ఓడిపోతే చూద్దాం అనుకునే వాళ్లు కూడా పెరుగుతారు. మనం ఓడిపోతే చూడాలనుకునే వారికి ఓడించడానికి నేను ప్రయత్నించడం లేదు. కానీ నేను గెలుస్తాను అని నమ్మే వాళ్లని గెలిపించడానికి నేను కష్టపడుతూనే ఉంటా. మీరు నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను ఇచ్చారు. మనల్ని ఎవరూ ఆపలేరు. నా నమ్మకం మీద మీ అందరికీ చాలా నమ్మకం ఉందని నాకు తెలుసు. ఆ నమ్మకంతో చెప్తున్నా.. 23 రాత్రి నుంచి థియేటర్‌లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సినిమా మొదలైనప్పుడే జడలకి మీకు ఒక లాక్ పడుతుంది. అప్పుడు అంటుకునేది వైల్డ్ ఫైర్. శ్రీకాంత్ మాటల్లో చెప్పాలంటే తగలబడిపోతుంది. ఇది జడల్ గానీ వాదా." అన్నారు.
ఇది కూడా చదవండి: నాని చెప్పిందే జరిగింది.. ‘ప్యారడైజ్’ మూవీకి A సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతో తెలుసా.?
మీకు నచ్చవచ్చు:
ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి 'A' సర్టిఫికెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు.!
ఒకే సినిమాలో ముగ్గురు మెగాస్టార్లు.. ఆ సినిమా కోసం దర్శకేంద్రుడు చేసిన సాహసం ఇదే!
[The Paradise Movie Pre Release Event, Natural Star Nani Speech, Paradise Pre Release Event, Nani Speech, Srikanth Odela, Manchu Mohan Babu, Telugu Film News, Telugu News]






