Home

»

Latest News

ఎందుకిత క్రేజ్: 'ప్యారడైజ్' హౌస్‌ఫుల్ బుకింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!

Sep 22, 2026 11:04AM


ప్రెజెంట్ రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికుల్లో ప్యారడైజ్ ముసురు వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఎట్మాస్పియర్ ఇక్కడ కూడా ఉందంటూ ఓవర్ సీస్ సినీ ప్రేమికులు కూడా చాలా బలంగా చాటి చెప్తున్నారు. దీంతో అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ వరల్డ్ ఫాస్టెస్ట్ రైలు లాగా వేగంగా ఫిలప్ అవుతున్నాయి. అసలు నానికి ఎందుకు ఇంత క్రేజ్. ఆ క్రేజ్ ఎలా సాధ్యమైంది? ఆయన మొదటి సినిమా 'అష్టా చమ్మా' నుంచి నేటి 'పారడైజ్' వరకు ప్రదర్శించిన వైవిధ్యమే దీనికి ప్రధాన కారణమా అంటే, అవుననే చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

నాని కెరీర్‌ను నిశితంగా గమనిస్తే, ఆయన ఏరోజూ ఒకే తరహా మూస క్యారెక్టర్స్ కి   పరిమితం కాలేదు. తన 15 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 30 కి పైగా విభిన్నమైన సినిమాల ద్వారా అభిమానుల సంఖ్యని పెంచుకుంటూ వెళ్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో 'అష్టా చమ్మా', 'పిల్ల జమీందార్', 'భలే భలే మగాడివోయ్' వంటి చిత్రాలతో 100% నవ్వులు పూయించే కామెడీ టైమింగ్‌తో కుటుంబ ప్రేక్షక వర్గాన్ని పూర్తి స్థాయిలో తనవైపు తిప్పుకున్నాడు  కేవలం వినోదానికే పరిమితం కాకుండా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన నటనకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 'జెర్సీ' చిత్రంలో 36 ఏళ్ల వయసులో క్రికెటర్‌గా రీ-ఎంట్రీ ఇచ్చే అర్జున్ పాత్రలో ఆయన చూపించిన భావోద్వేగాలు ప్రతి ఒక్కరి గుండెలని  పిండేశాయి.  దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించి నాని నటనా విశ్వరూపాన్ని చాటిచెప్పింది.

ఇది కుడా చదవండి: తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం: ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు

 

ఇటీవలి కాలంలో నాని తన రూట్ పూర్తిగా మార్చేశారు. 'దసరా' చిత్రంలో ధరణిగా ఊరమాస్ లుక్‌లో కనిపిస్తే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన 'హాయ్ నాన్న'తో మళ్లీ క్లాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసి  75 కోట్లని తన బ్యాంకు ఖాతాలో వేసుకున్నాడు. ఇక సరిపోదా శనివారం, హిట్ 3 కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరి నాని అంటే ఆషామాషీ అనుకుంటున్నారా అని చెప్పినట్లయింది. ఇప్పుడు ప్యారడైజ్ లో మునుపెన్నడూ చూడని సరికొత్త డిఫరెంట్ షేడ్‌లో  కనిపించబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 15 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది.

 

 ఏది ఏమైనా  సగటు ప్రేక్షకుడికి నాని అంటే పక్కంటి అబ్బాయి అనే భావన ఉంటుంది. ఆయన ఎంచుకునే కథలు, పాత్రలలోని సహజత్వం, ఎమోషనల్ కనెక్షన్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయి. ప్రయోగాలకు భయపడకుండా ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించడమే నాని విజయ రహస్యం. అందుకే 'ప్యారడైజ్' సినిమా బుకింగ్స్  ఈ స్థాయిలో ఊపేస్తోంది. కథే కథానాయకుడిగా నమ్మే నాని రూపంలో ప్రస్తుతం సినీ బంగాళాఖాతంలో  ప్యారడైజ్ అనే ఎంటర్ టైన్ మెంట్ వాయుగుండం పడింది. రేపు బెనిఫిట్ షోస్ నుంచే  వరల్డ్ వైడ్ థియేటర్స్ లో తీరం దాటనుంది.

 

మీకు నచ్చవచ్చు : 

ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి: రాజశేఖర్ వింటేజ్ సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!

భరత వేదముగా: ప్రభాస్ 'పౌర్ణమి' క్లాసిక్ గీతం.. సిరివెన్నెల కలం నుంచి జారిన నాట్య వేదం.!

 

The Paradise, Nani, Nani Paradise Advance Bookings Analysis, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com