Home

»

Latest News

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్: నాని టార్గెట్ ఇదే.!

Oct 19, 2026 2:47PM

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఇప్పుడు ‘బ్లడీ రోమియో’తో మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నాని జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర బృందం హైదరాబాద్‌కు షిఫ్ట్ కానుంది.

ఢిల్లీలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ మరో ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు సమాచారం. సినిమా కథాంశం విషయానికి వస్తే.. ఫుడ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేరాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఆహార వ్యాపారం చుట్టూ నడిచే అక్రమాలు, నేర ప్రపంచానికి సంబంధించిన అంశాలను కథలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే నాని సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా విభిన్నమైన కథలతో పాటు తన పాత్రలో కొత్తదనం చూపించేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ‘బ్లడీ రోమియో’ కూడా అలాంటి ప్రయత్నమేనా? ఫుడ్ మాఫియా, గ్యాంగ్‌స్టర్ క్రైమ్ నేపథ్యంలో నాని ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఈ సినిమాను 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయనే నమ్మకం వచ్చిన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలని నాని భావిస్తున్నారట. దీంతో ముందుగానే డేట్ ప్రకటించి, ఆ తర్వాత వాయిదా వేయడం కంటే.. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: మరో స్క్విడ్ గేమ్‌లా కల్ట్.. విశ్వక్ సేన్ మూవీ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.!

 

 

 

[Nani Joins Bloody Romeo Shoot, Bloody Romeo Shooting, Nani Bloody Romeo Movie, Bloody Romeo Story, Food Mafia, Gangster, Telugu Movies 2027, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com