TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

చిరు పేరులో 'N'ఎందుకు లేదో ప్రోమో రిలీజ్ చేసారు: ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

Nov 24, 2026 12:04PM

మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఉన్న వైబ్రేషన్స్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి తనదైన ఛరిష్మాతో సెల్యులాయిడ్, అభిమానులు, ప్రేక్షకులని తన సినీ కాంపౌండ్ వాల్ లో కట్టిపడేసాడు.  

ఇప్పుడు ఆయన మెగావర్స్' టాక్ షో తో కొత్త అవతారం ఎత్తబోతున్నవిషయం తెలిసిందే.   ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాంటిది ఆయన పేరులోనే ఓ అక్షరం కనిపించకుండా పోతే? ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తున్న భారీ హోర్డింగ్స్‌ ఇదే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సాధారణంగా ‘CHIRANJEEVI’ అని ఉండాల్సిన పేరును ‘CHIRA_JEEVI’ అంటూ మధ్యలో ‘N’ లేకుండా ముద్రించారు. దీంతో అసలు దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కొందరు ఇది కొత్త మూవీ ప్రమోషన్ అనుకుంటున్నారు.

అయితే ఈ హోర్డింగ్స్‌ వెనుక అసలు కారణం తెలుపుతూ రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ మరో వీడియో రిలీజ్ చేసింది. అందులో N  అక్షరం లేదని చిరంజీవికి సంబంధించిన అభిమానులు తమ రోజు వారి పనులు చేస్తూనే ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత చిరు వచ్చి ఇది నా అడ్డా అనడంతో పాటు 'N ' అంటే నెట్ ఫ్లిక్స్ సింబల్ అని కూడా క్లారిఫై ఇచ్చారు. నిమిషం ఐదు సెకన్లు ఉన్న ఈ వీడియో ఇప్పుడు అభిమానులని ఆకట్టుకుంటుంది.

ఈ కార్యక్రమం కేవలం సెలబ్రిటీల ఇంటర్వ్యూలకే పరిమితం కాకుండా.. వారి జీవితాల్లోని ఆసక్తికరమైన సంఘటనలు, కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, సినీ ప్రయాణంలో జరిగిన మరచిపోలేని విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ముఖ్యంగా చిరంజీవికి సినీ పరిశ్రమలో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఈ షోకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఇది కూడా చదవండి:అడివి శేష్‌ కొత్త మూవీ: ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే?డైరెక్టర్ ఎవరంటే?

ఇక ఈ షోలో పాల్గొనబోయే అతిథుల విషయంలోనే అసలు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి స్టార్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీరితో పాటు బ్రహ్మానందం, సునీల్, సత్య వంటి కమెడియన్లు కూడా సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ అతిథుల జాబితా మొత్తానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ స్టార్ హీరోలంతా చిరంజీవితో ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు అంతకంటే పెద్ద పండగ ఏముంటుంది? ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ఒకే టాక్ షోలో కనిపిస్తే సోషల్ మీడియాలో ఎలాంటి హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిరంజీవి, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు సినిమాల్లో కాకుండా టాక్ షోలో వీరిద్దరూ ఒకే వేదికపై కనిపిస్తే వినోదం మరో స్థాయిలో ఉండటం ఖాయం.

 

వారి మధ్య జరిగే సరదా సంభాషణలు, పాత సినిమా జ్ఞాపకాలు, షూటింగ్ సమయంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే అవకాశం ఉంది. అలాగే సునీల్, సత్యలతో చిరంజీవి చేసే ముచ్చట్లు కూడా షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. నవంబర్ 30న హైదరాబాద్‌లో మెగావర్స్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో షోకు సంబంధించిన మరిన్ని వివరాలు, అతిథుల జాబితా, స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

మీకు నచ్చవచ్చు:వైరల్ గా మారిన విజయ్ సేతుపతి: ఆ అరుదైన గౌరవం కరెక్ట్ నేనా!
మీకు నచ్చవచ్చు:పెద్ది: జాన్వీ కపూర్ మ్యాటర్ ఇంకా అయిపోలేదా!

 

 

[Megaverse Talk Show, Chiranjeevi, Netflix, Mega Fans, Tollywood]

 

 

google-ad-img