Home

»

Latest News

చిరంజీవి డైరెక్టర్ తో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ!

Aug 19, 2026 10:56AM

 

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటవారసుడు సెమి గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ  సినీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో రీగర్  గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిమానులైతే సెల్యులాయిడ్ నందమూరి మూడో తరం వారసుడు నట విశ్వరూపాన్ని చూసే భాగ్యం కలిగించమని మొక్కని దేవుడు లేడంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి నందమూరి సినీ వారసత్వానికి ఉన్న చరిష్మాని అర్ధం చేసుకోవచ్చు.  


తాజా ఫిలింనగర్ బజ్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'ని తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే పేరు   పేరు వినిపిస్తోంది. బింబిసార లాంటి విజువల్ వండర్‌తో మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని  70 కోట్లకు పైగా వసూళ్లతో తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట, నందమూరి వారసుడి ఎంట్రీ కోసం ఒక అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు సమాచారం.  బాలకృష్ణ గారే స్వయంగా తన కుమారుడి డెబ్యూ గ్రాండ్ scale లో ఉండాలని, ఎలాంటి కంప్రమైజ్ కాకుండా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. గతంలో 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' గురించి వార్తలు వచ్చినప్పటికీ, మోక్షజ్ఞను సరికొత్త మాస్ మరియు యూత్ ఫుల్ అవతార్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్టుగా టాక్.

Also Read: ఆ ఇద్దరు హీరోలతో జాగ్రత్తగా ఉండు.. చరణ్ కి చిరంజీవి సలహా!

 త్వరలోనే ఈ మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో విశ్వంభర డైరెక్టర్ కూడా మంచి ఛాయస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

BalaKrishna, Mokshagna, Vasishta

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com