
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీవియస్ మూవీ పెద్దితో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. నిజం చెప్పాలంటే చరణ్ పడిన కష్టానికి పెద్ది పాన్ ఇండియా లెవల్లో ఇంకా బాగా ఆడాల్సిన మూవీ. కానీ పెద్ది లక్ష్యాన్ని ప్రేక్షకులు తమ లక్ష్యగా అనుకోవడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో గూస్ బంప్స్ తీసుకురాకపోవడం కొంచం మైనస్ అనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపించాయి. రీసెంట్ గా చరణ్ కి చిరంజీవి చెప్పిన సలహా ఇదే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో చూద్దాం.
చరణ్ తో చిరంజీవి ఎవరైతే నెగెటివ్ థాట్స్ తో ఉంటారో, సక్సెస్ లు రాకపోవడంతో డిప్రెషన్ కి లోన్ అయి ఉంటారో అలాంటి ఇద్దరు హీరోలతో స్నేహం చేయకు. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అంటే అలాగే జడ్జిమెంట్ పర్ఫెక్ట్ గా లేని హీరోలతో కూడా స్నేహం చేయకని చెప్పారట. ఎందుకంటే తను ఒక కథను విన్న తర్వాత తన క్లోజ్ గా ఉండే హీరోలకు ఆ కథని చెప్పి ఆ సినిమా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్న క్రమంలో ఆ హీరోల ఒపీనియన్ తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు సరైన జడ్జిమెంట్ చెప్పలేరు. కాబట్టి అలాంటి వాళ్ళతో స్నేహం చేయవద్దని చెప్పారట. ఇక ఇండస్ట్రీలో అలాంటి హీరోలు ఎవరున్నారు అనేది తెలియదు గానీ మొత్తానికైతే ఆ మెంటాలిటీతో ఉన్న ఇద్దరు హీరోలను దగ్గరికి రానివ్వకని చెప్పారట.
Also read: ఐదురోజుల్లోనే 150 కోట్ల చేరువలో ఓజి విలన్ 'ఓమి
చరణ్ తన నెక్స్ట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. రంగస్థలం కాంబో కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చిరంజీవి తన కొత్త చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య కాంబో కావడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు.
Chiranjeevi, Ram charan






