Home

»

Latest News

విషాదం: నానా పటేకర్ కన్నుమూత.. దిగ్గజ నటుడి మృతికి కారణమిదే.!

Oct 8, 2026 7:58AM

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన నానా పటేకర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం ఉదయం 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం నానా పటేకర్ తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు వైద్యులు CPR చేసి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని వైద్యులు తెలిపారు.

నానా పటేకర్ పేరు కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాదు. హిందీతో పాటు మరాఠీ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన.. విభిన్నమైన పాత్రలు, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో చెరగని గుర్తింపు తెచ్చుకున్నారు.

‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా విలక్షణమైన నటనతో పాత్ర ఏదైనా తనదైన స్టైల్‌లో పండించడం నానా పటేకర్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. తెరపై ఆయన కనిపిస్తే చాలు.. ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన బరువు వచ్చేదంటే అతిశయోక్తి కాదు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ నానా పటేకర్ తన ప్రతిభను చాటుకున్నారు. 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com