Home

»

Latest News

నాగార్జున, టబు కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా: ప్రేమ ప్లేస్ లో యుద్ధమేనా!

Nov 4, 2026 10:35AM

 

కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే, ఏటో వెళ్లిపోయింది మనసు అంటూ నిన్నే పెళ్లాడుతా' తో తెలుగు సినిమాకి సరికొత్త ప్రేమని, రూపాలని అందించిన ఫెయిర్ నాగార్జున, టబు.. సాధారణంగా సాంగ్స్ కి తెర చుట్టూ లైటింగ్ వేయడం కామన్. కానీ ఆ ఇద్దరు స్క్రీన్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే కూడా తెర చుట్టూ లైటింగ్ వేశారంటే ఆ కాంబో సృష్టించిన ప్రేమ సునామిని అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ ఇద్దరు ప్రత్యర్థులుగా సెల్యులాయిడ్ ని షేక్ చేయబోతున్నారా అనే టాక్ అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా జరుగుతుంది.


టబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రీసెంట్ గా ఆమె క్యారక్టర్ కి సంబంధించిన    గ్లింప్స్ రిలీజ్ చేసారు. ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే గంభీరమైన రాజకీయ నాయకురాలి (పొలిటికల్ లీడర్) పాత్రలో కనిపిస్తున్నారు. పాతకాలం నాటి రేడియో వాయిస్, నూలు చీరకట్టులో ఆమె నడిచివచ్చే రాచరికపు నడక, ఆమె కళ్లలో కనిపించే పౌరుషం చూస్తుంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఆమె క్యారక్టర్ ఉండబోతోందో అర్థమవుతోంది. అదృష్టం కన్నా కష్టపడటాన్నే నమ్మే నాయకురాలిగా టబు కనిపిస్తుండగా, నాగార్జునకు ఆమె గట్టి పోటీ ఇచ్చే ప్రతినాయక ఛాయలున్నక్యారక్టర్ అనే విషయం ఈజీగా అర్దమవుతుంది. కొంత ముందైతే అలనాటి క్లాసిక్ మూవీ 'పండంటి కాపురం' లో జమున లా ప్రేమలో మోసపోయిన క్యారక్టర్ అయి ఉండవచ్చని అంటున్నారు.

ఇది కూడా చదవండి: సీన్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే: సెకండ్ హాఫ్ పరిస్థితి ఏంటంటే!

 

ఏది ఏమైనా ఒకప్పడు అమృతాన్ని కురిపించే స్వచ్ఛమైన, కల్మషం లేని ప్రేమని కురిపించిన ఈ జంట ప్రత్యర్థులుగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100 వ చిత్రం  కింగ్ 100’ (లాటరీ కింగ్) కాగా  ఆర్. ఏ. కార్తీక్ దర్శకుడు..రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్.

 

[Nagarjuna King 100 Tabu Glimps Released, Nagarjuna King 100, Tabu character glimpse, Mahanthi Jhansi Rani, King 100 Tabu look, Nagarjuna 100th movie, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com