
హిట్టు నా కేర్ ఆఫ్ అడ్రెస్స్ అంటూ సూర్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6 న 'సీన్' మూవీతో సెల్యులాయిడ్ ముందు మరోసారి కలెక్షన్స్ తుఫాన్ ఉంచే హామీతో వస్తున్నాడు. క్రైం థ్రిల్లర్ కావడంతో పాటు ప్రమోషన్స్ లో సూర్యలో దాగి ఉన్న మరో కొత్త విశ్వరూపం చూస్తుంటే హామీ నెరవేర్చుకుంటాడని అభిమానులు చాలా గట్టి నమ్మకంతోనే ఉన్నారు.
సీన్ కి సంబంధించి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) రీసెంట్గా అధికారికంగా స్క్రీనింగ్ పూర్తి చేసింది. వీక్షించిన సెన్సార్ సభ్యులు ‘యూఏ 16+’ (UA 16+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రన్‌టైమ్, ఇన్సైడ్ టాక్‌కు సంబంధించి వస్తున్న వివరాలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సూర్య క్యారక్టర్ అత్యంత వైవిధ్యంగా ఉండబోతోంది. ఎవరి మాట వినని, పూర్తి దూకుడు స్వభావం మరియు ఆవేశం ఉన్న ఇంబరాజ్ అనే కఠినమైన పోలీస్ ఆఫీసర్‌గా సూర్య కనిపిస్తున్నాడు.కొన్నేళ్ల కిందట మిస్టరీగా మారిన ఒక క్లిష్టమైన కేసును మళ్లీ రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడం ఈ చిత్ర కథాంశం. అయితే, ఒక సిన్సియర్ పోలీస్ అయినప్పటికీ, ఎలాంటి క్రమశిక్షణ లేని గందరగోళం సృష్టించే ఒక వింత టీమ్‌ని సూర్య ఎంచుకోవడం కథలో అసలు మలుపు. ఈ టీమ్‌లో భాగమైన నెస్లెన్ (ఈశ్వరన్) మరియు ఇతర నటీనటుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని సెన్సార్ టాక్ చెబుతోంది.

సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం, సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మరింత వేగంగా, ఊహించని ట్విస్టులతో సాగుతుంది. సూర్య నటన, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచాయని సమాచారం. జీతూ మాధవన్ దర్సకత్వం, సుశిన్ శ్యామ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని, థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సీన్లు ఉంటాయని ఇన్సైడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నజ్రియా నజీమ్ కీ రోల్ లో కనిపిస్తుండగా సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. సెన్సార్ టాక్ పాజిటివ్‌గా రావడంతో అభిమానులు దీపావళి సెలబ్రేషన్స్ ని ముందుగానే చేసుకుంటున్నారు.
[Suriya Scene Movie First Review, Suriya Scene movie, Scene first review, Scene censor talk, Suriya Jithu Madhavan, Scene movie runtime, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]






