ఒకే బాటలో గేమ్ చేంజర్,మాడ్ స్క్వేర్..ఎందుకిలా జరిగింది
on Apr 1, 2025
తెలుగు చిత్ర పరిశమ్రలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో 'సితార ఎంటర్ టైన్ మెంట్స్(Sithara Entertainments)కూడా ఒకటి.సంవత్సరానికి నాలుగైదు సినిమాలు నిర్మిస్తు తమ సత్తా చాటుతున్నారు.జెర్సీ,బీమ్లానాయక్,బాబు బంగారం,సార్,టిల్లు స్క్వేర్, మాడ్,డాకుమహారాజ్,లక్కీభాస్కర్ వంటి పలు విజయవంతమై చిత్రాలని నిర్మించింది. రీసెంట్ గా మార్చి 28 న మాడ్ కి సీక్వెల్ గా తెరకెక్కిన 'మాడ్ స్క్వేర్' ఈ సంస్థ నుంచి వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.కాకపోతే రిలీజ్ రోజే పైరసి బారిన పడటంతో మేకర్స్ షాక్ కి గురయ్యారు.
ఈ విషయంపై సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ(Naga Vamshi)మాట్లాడుతు'మాడ్ స్క్వేర్'(Mad Square)పైరసీ ఎక్కడ జరిగిందో గుర్తించాం.ఓవర్ సీస్ రిలీజ్ రూల్స్ ప్రకారం కొన్ని కంట్రీస్ కి మాడ్ స్క్వేర్ సెన్సార్ కాపీ పంపించాం.అక్కడనుంచే పైరసీ జరిగిందనేది అర్ధమవుతుంది.ఈ విషయంపై ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ తో డిస్కర్షన్ చేసాం.గేమ్ చేంజర్(Game Changer)కూడా ఓవర్ సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవ్వడంతోనే పైరసీ జరిగింది.ఈ విధంగా రెండు సినిమాలకి ఒకే రకంగా పైరసీ జరిగిందని చెప్పుకొచ్చాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
