స్క్రీన్ సైజు మారింది తప్ప ఎంటర్టైన్మెంట్ సైజు మారలేదు..
on Apr 1, 2025
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కోసం ప్రదీప్ బాగా ప్రొమోషన్స్ చేస్తున్నాడు. ఐతే గతంలో కొన్ని మూవీస్ లో నటించాడు కానీ ఒక బ్రేక్ రాలేదు. కానీ ఈ మూవీని కొంతమంది ఫ్రెండ్స్ తో కలిపి తీసాడు ప్రదీప్. ఈ మూవీ కారణంగా కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించడం మానేసాడు. ఐతే ఆడియన్స్ ఈ మూవీకి ఎందుకు రావాలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. "కథ, కంటెంట్ మీద పట్టు, కాన్సంట్రేషన్ ఉంటే అది టీవీ ఫేస్ ఐనా సినిమా ఫేస్ ఐనా కానీ 70 ఎంఎం స్క్రీన్ మీద చూడడానికి ఆడియన్స్ టికెట్ కొని సినిమా చూస్తారు. అలా ఆడియన్స్ రావాలి అనే వాళ్లకు ఎంటర్టైన్మెంట్ అనేది ఆ కంటెంట్ లో ఉండాలి.
స్క్రీన్ సైజు మారింది తప్ప ఎంటర్టైన్మెంట్ సైజు మారలేదు అని మేము భావించాము. బుల్లితెర మీద ఎలా ఎంటర్టైన్ చేసామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ ని తీసుకురావాలని ఈ మూవీ ఆడియన్స్ ముందుకు తెచ్చాము. అలాగే సినిమాల్లో నిలదొక్కుకోవాలి అంటే బుల్లితెరను వదిలేస్తేనే సాధ్యం అనేది కాదు.అవకాశాలు వస్తూనే ఉంటాయి. పది పన్నెండేళ్ల నుంచి మంచి షోస్ చేస్తున్నాను అంతే కానీ నేను ఎక్కడా ఎంప్లొయ్ ని కాదు. బుల్లితెర మీద ఆపేసి సిల్వర్ స్క్రీన్ మీదకు రావాలి అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. మా ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కోసం ఎక్కువ శాతం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బుల్లితెర మీద నేను చేసే షోస్ వాళ్ళను ఇబ్బంది పెట్టలేను కాబట్టి అప్పటి వరకు కమిట్ ఐనా షోస్ అన్నిటినీ కంప్లీట్ చేసి ఈ మూవీ చేసాను. ఈ సినిమా నా మనసుకు బాగా హత్తుకుంది. అందుకే దీని మీద ఎక్కువగా కాన్సంట్రేషన్ పెట్టి ఈ మూవీలో నటించాను " అంటూ చెప్పాడు ప్రదీప్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
