డిసెంబర్‌లో సినిమాల జాతర.. మూవీ లవర్స్‌కి ఇక పండగే!
on Dec 1, 2025
2025 సంవత్సరంలో స్టార్ హీరోల భారీ సినిమాలు, అప్‌కమింగ్ హీరోల డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఎన్నో వచ్చాయి. అందులో పెద్ద హీరోల సినిమాలే కాదు, చిన్న హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. భారీ సినిమాలు కలెక్షన్ల పరంగా స్టామినా చూపించగా, చిన్న సినిమాలు ప్రేక్షకుల మనసుకు హత్తుకునే స్థాయిలో పెర్‌ఫార్మ్ చేశాయి. ఈ ఏడాది చివరి నెలకు వచ్చేశాం. డిసెంబర్ నెలలో కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కొన్ని సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ నెలలో విడుదలయ్యే సినిమాలు డిఫరెంట్ జోనర్స్‌లో రూపొందించబడ్డాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అవతార్ 3' కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాతోపాటు తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
ఈ నెలలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల్లో 'అఖండ2 తాండవం' చిత్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ సాధించింది. ఇప్పుడు వీరిద్దరూ 'అఖండ2'తో రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా వారికి ఒక కొత్త అనుభూతిని కలిగించాయి. డిసెంబర్ నెలలో థియేటర్లలోకి రాబోతున్న మొదటి సినిమా ఇదే కావడంతో మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక రెండో వారంలో రోషన్ కనకాల, సందీప్ రాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'మోగ్లీ' విడుదల కాబోతోంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాలో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్‌గా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అదే రోజు మరో యంగ్ హీరో రామ్‌కిరణ్ చేసిన 'సుకుటుంబానాం సైతం' కూడా రిలీజ్ అవుతోంది. టైటిల్‌ని బట్టి చూస్తే ఇది ఒక కుటుంబ కథా చిత్రంగా కనిపిస్తోంది.
ఇటీవలి కాలంలో ఆది సాయికుమార్ నటించిన సినిమాలేవీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. తాజాగా అతను చేసిన సినిమా 'శంబాల'. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అతీంద్రియ శక్తులు, సైన్స్ నేపథ్యంలో ఉంటుంది. ప్రేక్షకుల్ని ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్లే స్టఫ్‌తో వస్తున్న ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన సినిమా 'ఛాంపియన్'. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా డిసెంబర్ 25నే విడుదల కాబోతోంది. అదే రోజు శివాజీ, నవదీప్, బిందుమాధవి నటించిన 'దండోరా' మూవీ కూడా రిలీజ్ కానుంది.
డిసెంబర్ నెలలో తెలుగు సినిమాలతో పాటు రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమా 'అవతార్.. ఫైర్ అండ్ యాష్'. డిసెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అవతార్ సిరీస్‌లో రెండు భాగాలు విడుదలై ఘనవిజయం సాధించాయి. ప్రేక్షకుల్ని ఒక కొత్తలోకంలోకి తీసుకెళ్లేందుకు వస్తున్న ఈ సినిమా మూవీ లవర్స్‌కి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ నిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



