
ఒకప్పుడు విలనిజం అంటే మోహన్ బాబు పేరు కూడా గుర్తొచ్చేది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అదే.. ‘ది ప్యారడైజ్’.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. చూస్తుంటే ఇది చాలా క్రూరమైన విలన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే మోహన్ బాబుకు విలన్ పాత్రలు కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభంలోనే ‘స్వర్గం నరకం’ సినిమాతో నెగెటివ్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత శివరంజని, కొదమ సింహం, వారసుడొచ్చాడు, కూలీ నెం.1, సర్దార్ పాపారాయుడు, కొండవీటి దొంగ వంటి సినిమాల్లో విభిన్నమైన విలన్ పాత్రలు చేశారు. విలనిజంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు.

ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో నెగెటివ్ క్యారెక్టర్లకు మంచి ఇంపాక్ట్ ఇచ్చేవి. ఆ తర్వాత హీరోగా కూడా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ.. విలన్‌గా మోహన్ బాబు చేసిన కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయాయి.
అలాంటి మోహన్ బాబును మళ్లీ పూర్తి స్థాయి బ్రూటల్ నెగెటివ్ రోల్‌లో చూడబోతుండటంతో ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి పెరుగుతోంది. నిజానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ పాత్ర కోసం మోహన్ బాబు అయితేనే కరెక్ట్ అని మొదటి నుంచే భావించారట. కథ చెప్పినప్పుడు మోహన్ బాబు కూడా ఈ పాత్రపై చాలా ఆసక్తి చూపించారని నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.?
అంతేకాదు.. మోహన్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, ఆయన విశ్వరూపం సినిమాలో కనిపిస్తుందని శ్రీకాంత్ ఓదెల గతంలో చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది.
ఇక ‘ది ప్యారడైజ్’ మోహన్ బాబుకు మరో విధంగా కూడా ప్రత్యేకమే. కెరీర్‌లో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన చేస్తున్న ఈ తరహా భారీ నెగెటివ్ పాత్ర కావడంతో.. మరోసారి తన పాత విలనిజం ఎలా ఉంటుందో చూపించే అవకాశం దక్కింది.
మరి ఒకప్పుడు విలన్‌గా తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు.. ఇప్పుడు ‘శికంజా మాలిక్’గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
'ప్యారడైజ్' సినిమా చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు.!
ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!
[The Paradise Movie, Mohan Babu Villain Role, Shikanja Maalik, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu Movies, Telugu Film News, Telugu News]





