అడివి శేష్ కొత్త మూవీ: ఆ లక్కీ హీరోయిన్ ఎవరంటే?డైరెక్టర్ ఎవరంటే?
Nov 24, 2026 11:27AM

అడివిశేష్ గత కొంతకాలంగా వరుస హిట్స్ తో డీప్ ఫ్రెండ్ షిప్ చేస్తూ వస్తున్నాడు. డిఫరెంట్ కథలకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన శేష్ కి కాలంఅనుకూలంగా ఉండటంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న డెకాయిట్ సైతం పర్వాలేదని కలెక్షన్స్ ని రాబట్టింది. అందుకు మృణాల్ ఠాకూర్ కూడా ఒక కారణమైనా కూడా హీరో అడివి శేష్ నే కాబట్టి హిట్ క్రెడిట్ 'వైఫె' లా అంటిపెట్టుకుంది.
అడివి శేష్ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'గూఢచారి 2'తో బిజీగా ఉన్న శేష్ తన నెక్స్ట్ మూవీని కూడా లైన్లో పెట్టేశారు. ఈసారి 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో కలిసి పనిచేయబోతున్నారట. ఇప్పటికే కథా చర్చలు పూర్తవడంతో పాటు శేష్ కూడా ఓకే చెప్పినట్లు టాక్. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఎలాంటి కథతో రాబోతున్నారు?
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నటించబోయే కథానాయిక కోసం చిత్ర బృందం అన్వేషణ మొదలుపెట్టిందట. హీరోయిన్ ఎంపిక పూర్తయిన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

అయితే ఈ సినిమాలో శేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాహుల్ రవీంద్రన్ 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో రష్మిక మందన్నకు మంచి పాత్రను అందించారు. మరి ఈసారి కూడా ఆయన ఏదైనా కొత్త తరహా కథను సిద్ధం చేశారా? అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం: ఆనందంతో పొంగిపోతున్న తెలుగు ఫ్యాన్స్!
నటుడిగా కెరీర్ ప్రారంభించిన రాహుల్ రవీంద్రన్.. దర్శకుడిగా 'చి ల సౌ' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగార్జునతో 'మన్మథుడు 2' తెరకెక్కించారు. ఇటీవల రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టితో 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాను రూపొందించారు. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్లో చర్చకు దారితీసింది.
ఇప్పుడు అడివి శేష్ కోసం మరో కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కథలోని కొత్తదనం నచ్చడంతోనే శేష్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా జానర్, కథాంశం గురించి మేకర్స్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
మరోవైపు అడివి శేష్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'గూఢచారి 2' (G2) పనుల్లో బిజీగా ఉన్నారు. 2018లో వచ్చిన 'గూఢచారి' బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వామికా గబ్బి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చవచ్చు:మహాశక్తి ఓటిటి డేట్: తెలుగు ప్రేక్షకులకి ఈ బంపర్ ఆఫర్!
మీకు నచ్చవచ్చు:జాన్వీ కపూర్ వివాదంపై శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు!
[Adivi Sesh, Rahul Ravindran, Goodachari 2, Tollywood]



.webp)
